English   

ఆ హీరోతో ప్రేమలో పడిన మాజీ స్టార్ హీరో కూతురు..

tollywood
2019-11-30 15:42:23

తెలుగు ఇండస్ట్రీలో ప్రేమకథలు కామన్. ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇంక ఇప్పుడు కూడా ఒక సీనియర్ స్టార్ హీరో కూతురు ఇండస్ట్రీలో ఒక హీరో ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో ప్రేమలో ఒక అవుట్ డేటెడ్ సీనియర్ హీరో కూతురు ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన సినిమాలు వచ్చినా కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. రెండేళ్ల కిందట ఒక సినిమాతో కాస్త నేనున్నాను అని గుర్తు చేసినా కూడా ఆ తర్వాత వచ్చిన సినిమా మర్చిపోయేలా చేసింది. 

ఎప్పటికప్పుడు వివాదాల్లో ఉండే ఆ హీరోకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అక్క సినిమా విడుదల కాకుండానే చెల్లెలు హీరోయిన్ అయిపోయింది. ఇక ఇప్పుడు పెద్ద కూతురు ఒక కుర్ర హీరోతో ప్రేమలో పడిందని డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీని కుటుంబం కూడా చర్చ జరిగిందని.. అయినా కూడా హీరోయిన్ తన మనసు మార్చుకోకపోవడంతో చేయలేని పరిస్థితుల్లో పడిపోయారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అన్నట్లు ఆ హీరో కూతురు తొలి సినిమా మొదటి సగం షూటింగ్ పూర్తయిన తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆమెను హీరోయిన్గా చేయడానికి సదరు హీరో చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అవి పెద్దగా సక్సెస్ కాకపోయినా కూడా కచ్చితంగా కూతురు హీరోయిన్ గా నిలబెట్టి ఆమె కెరీర్ను దారిలో పెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ సీనియర్ హీరో. కానీ ఆమె మాత్రం ఆ హీరో ప్రేమలో పడి కెరీర్ ని నాశనం చేసుకుంటుందో అని సన్నిహితులు కూడా కంగారు పడుతున్నారు. మరి ఈ ప్రేమకథ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

More Related Stories