English   

మహేష్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న అనిల్ రావిపూడి సెంటిమెంట్..

Anil Ravipudi mahesh
2019-11-30 17:47:39

టాలీవుడ్లో అపజయం ఎరుగకుండా దూసుకుపోతున్న సంచలన కుర్ర దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు. దీనిపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. రామబ్రహ్మం సుంకర, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనిపై ఉన్న నమ్మకంతో మహేష్ బాబు కూడా ఒక నిర్మాతగా ఇందులో భాగస్వామి అయ్యాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11న సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఒక సెంటిమెంట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. 

అనిల్ రావిపూడి రచయితగా ఉండి చేసిన ఆగడు దరువు బలుపు లాంటి సినిమాలు ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. వాటికి మాటలు రాసింది అనిల్ రావిపూడి. అయితే ఆయన దర్శకుడిగా మారిన తరువాత తన దగ్గర ఉన్న అసిస్టెంట్ తో మాటలు రాయిస్తున్నాడు అనిల్ రావిపూడి. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎఫ్2 సినిమాకు.. దానికి ముందు వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా కూడా అనిల్ రావిపూడి కేవలం కథ మాత్రమే రాసాడు. డైలాగులతో అతనికి సంబంధం లేదు.

కానీ ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాకు మహేష్ బాబు మీద ఉన్న అభిమానంతో స్వయంగా డైలాగులు రాస్తున్నాడు అనిల్. దాంతో ఆయన పాత సెంటిమెంట్ ఎక్కడ ఈ సినిమాకు పని చేస్తుందా అని కంగారు పడుతున్నాను అని మహేష్ బాబు అభిమానులు. నిజానికి టీజర్ విడుదలయ్యే ముందు వరకు కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాపై అంచనాలు కాస్త తక్కువగానే ఉన్నాయి. 

కానీ టీజర్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో సంచలనాలు మొదలయ్యాయి. ఒక్క విజయశాంతి మినహా ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లు కామెడీ చేస్తా అని అనిల్ రావిపూడి చెప్పడంతో సినిమా పై ఆసక్తి పెరిగి పోతుంది. దానికితోడు భరత్ అనే నేను, మహర్షి సినిమా తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. వీటి ముందు అనిల్ రావిపూడి బ్యాడ్ సెంటిమెంట్ అసలు పనిచేయదు అంటున్నారు అభిమానులు.

More Related Stories