English   

స్పీడ్ పెంచిన రవితేజ...ఆరోజునే డిస్కో రాజా టీజర్

disco
2019-12-01 05:07:18

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. క్షణం ఫేమ్ వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమాని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ మీద రవితేజతో నెల టికెట్ సినిమా తీసిన రామ్‌ తాళ్లూరి ఈ సినిమాని  నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ భామ నభా నటేశ్‌ ఒక హీరోయిన్ కాగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ మరో హీరోయిన్ గా నటిస్తోంది. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుపుకుటోంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఆ మధ్య విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ సినిమా డిసెంబర్ 20,2019న విడుద‌ల కానుందని ముందు నుండీ ప్రచారం జరుగుతింది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రిలీజ్ కూడా నెల రోజులే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే కొని పోస్టర్లతో పాటుగా ఓక పాటని కూడా రిలీజ్ చేశారు. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. డిసెంబర్ 6 వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. చాన్నాళ్ళగా హిట్ లేని రవితేజ ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. చూడాలి మరి ఈ సినిమా ఏమవుతుందో ?

More Related Stories