English   

ప్రియాంక రెడ్డి మర్డర్.. ట్రెండ్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు..

ntr
2019-12-01 05:15:50

ప్రియాంక రెడ్డి.. ప్రియాంక రెడ్డి.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా ఈ పేరు తప్ప మరొకటి వినిపించడం లేదు. అర్ధరాత్రి పూట అమానుషంగా నలుగురు కీచకుల చేతిలో అత్యాచారానికి గురై అత్యంత దారుణమైన పరిస్థితుల్లో విగతజీవిగా దొరికింది ప్రియాంక రెడ్డి. సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తుంది. దాదాపు ఏడేళ్ల కిందట ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత ఆ స్థాయిలో అందరిలోనూ భయం పుట్టించిన సంఘటన ఇదే. ప్రియాంక రెడ్డి హత్య తర్వాత ఇప్పుడు యాదృచ్చికంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోని కొన్ని డైలాగులు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా దాదాపు 12 ఏళ్ల కింద కృష్ణవంశీ తెరకెక్కించిన రాఖీ సినిమాతో పాటు నాలుగేళ్ల కింద పూరి జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ సినిమా క్లైమాక్స్ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ఒక అమ్మాయిని చూసిన వెంటనే రేప్ చేయగలుగుతున్నాం.. తప్పు చేశామని ఒప్పుకుంటున్నాను.. రెండు రోజుల్లో ఉరితీసే దమ్ము మీకు ఉందా అంటూ టెంపర్ సినిమా క్లైమాక్స్ లో జడ్జి కోట శ్రీనివాస రావును జూనియర్ ఎన్టీఆర్ నిలదీసే సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. దాంతోపాటు రాఖీ సినిమా క్లైమాక్స్ సీన్ కూడా ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇక ఈ మధ్య కార్తికేయ హీరోగా నటించిన గుణ 369 క్లైమాక్స్ లో కూడా అమ్మాయిలపై అత్యాచారాలు చేసేవాళ్లను కనికరం లేకుండా చంపే సన్నివేశం కూడా బాగానే వైరల్ అవుతుంది. మొత్తానికి ప్రియాంక రెడ్డి ఘటనతో గతంలో కొన్ని సినిమా సన్నివేశాలు ఉండటం.. ఇప్పుడు వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అన్ని అలా ప్రేక్షకుల మనసు కదిలించేస్తున్నాయి.

More Related Stories