English   

ఎక్కడా తగ్గద్దంటున్న రామ్ చరణ్

ram
2019-12-01 05:23:47

ఆ చూపు ఏంటి, ఆ రూపు రేఖలు ఏంటి ? హీరోనా ? అసలు నటుడు అవుతాడో లేదో ? ఇదీ ఒకప్పుడు చరణ్ అదే నండీ మెగా తనయుడు రామ్ చరణ్ గురించి ఒకప్పుడు మాట్లాడిన మాటలు. కానీ ఇప్పుడు న‌టుడంటే ఇలా ఉంటాడురా అనిపించాడు. చిరంజీవికి త‌గ్గ త‌న‌యుడు కాదు.. ప్ర‌యోగాలంటే భ‌య‌ప‌డ‌తాడన్నారు. కానీ ఇప్పుడు కొత్త క‌థ‌లు ఉంటే ఆయ‌న రెడీ అంటూ ద‌ర్శ‌కులే కొత్త కధలు సిద్దం చేసుకుంటున్నారు. ఆ మనిషికి ఎక్స్‌ప్రెష‌న్స్ రావని హేళన చేసారు.. కానీ ఒక్క సినిమాతోనే త‌నెంత గొప్ప న‌టుడో అంద‌రికీ ప్రూవ్ చేశారు.  ఇలా ఒక్కో మైన‌స్ లెక్క‌లేసుకుంటూ వాటినే త‌న‌కు ప్ల‌స్‌లుగా మార్చుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్. చిరుత సినిమాతో 12 ఏళ్ల కింద ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు మెగా వార‌సుడు.

ఇక తాజాగా తన జర్నీని ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు రామ్ చరణ్. ఆరెంజ్ సినిమా మొదలు ఆ తర్వాత తాను చేసిన సినిమాలా పిక్స్ కొన్ని పోస్ట్ చేసిన ఆయన కీప్ గోయింగ్ అంటూ క్యాప్షన్ పెట్టాడు. అయితే దీనిని ఎవరికి వారు తమకు కావాల్సినట్టు అన్వయించుకుంటున్నారు. చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ ఓటమికి వెనకడుగు వేయకండి అంటూ మెసేజ్ ఇచ్చినట్టుగా ఫీల్ అయినట్టు అవుతున్నారు. నిజమేగా మరి. చరణ్ పెట్టిన పిక్స్ మీరే చూడండి.

 

More Related Stories