English   

రేప్ జరగడానికి కారణం నీలాంటి వాళ్లే.. హీరోయిన్ పై నెటిజన్ ఫైర్..

nidhi
2019-12-01 05:37:00

అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేస్తే.. వాళ్లు అందాలు చూపిస్తే రేపులు జరిగిపోతాయా.. అసలు ఎలాంటి సమాజంలో ఉన్న మనం.. అంటే ఈ లెక్కన అమ్మాయిలు వాళ్లకు నచ్చినట్లు ఉండటం ఎవరికి ఇక్కడ నచ్చడం లేదా.. వాళ్లకు ఇష్టమైన డ్రస్సులు వేసుకుని స్వాతంత్రం కూడా మన సమాజంలో లేదా.. అంటే దీనికి సమాధానం కాదు లేదు అనే వస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ప్రియాంక రెడ్డి మర్డర్ ఇష్యూతో మరోసారి  అమ్మాయిల వస్త్రధారణపై కూడా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ పై ఒక నెటిజన్ మండిపడ్డాడు. ఈమె కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై ఒక నెటిజన్ నిధిపై ఇష్టం వచ్చినట్లు ఫైర్ అయ్యాడు. నీలాంటి వారి వల్లే సామాన్య మహిళలపై రేపులు జరుగుతున్నాయి. నీ హాట్ శరీరాన్ని ఈ రకంగా చూపిస్తూ ఫొటోలు పోస్ట్ చేయకు అంటూ ఘాటు కామెంట్ చేశాడు. దాంతో నిధికి ఒళ్లు మండింది. ఇంకా సమాజంలో ఇలాంటి దరిద్రమైన ఆలోచన శైలి ఉన్న వ్యక్తులు ఉన్నారా..

వాళ్ళను చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.. అయ్యా బాబు నీ అడ్రస్ ఒకసారి నాకు పంపు నీకు పింక్ అనే సినిమా లింక్ పంపిస్తాను.. ఆ సినిమా నువ్వు చూడటం చాలా అవసరం అంటూ తనదైన శైలిలో ఘాటుగానే సమాధానం ఇచ్చింది నిధి అగర్వాల్. ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. అయితే ఎవరు ఏమనుకున్నా కూడా కేవలం అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేసినంత మాత్రాన అత్యాచారాలు హత్యలు జరుగుతాయి అనుకోవడం కంటే తెలివితక్కువతనం మరొకటి ఉండదు. ఒక అమ్మాయిని అమ్మాయిలా గౌరవించలేని మనిషి పుట్టుక పుట్టి ఏం లాభం.. జన్మనిచ్చిన అమ్మ కూడా ఆడదే అయినప్పుడు మరో ఆడదాన్ని అలాటప్పుడు దృష్టితో చూడటం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు మహిళా లోకం. మరి వాటికి ఈ సభ్య సమాజం ఎలాంటి సమాధానం చెబుతుంది..

More Related Stories