English   

ప్రియాంక రెడ్డి ఘటనపై స్పందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు..

mb
2019-12-01 16:11:00

ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పుడు వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు సంచలనం సృష్టిస్తుంది. ఎంతో కష్టపడి చదువుకుని డాక్టర్ గా సేవలు అందిస్తున్న 26 ఏళ్ల యువతిని అత్యంత పాశవికంగా దారుణంగా నలుగురు నీచులు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు. ఇప్పుడు ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మొత్తం దేశమంతా ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తుంది. ఇక ప్రియాంకా రెడ్డి మరణంపై చాలామంది సినీ ప్రముఖులు తమదైన శైలిలో స్పందన తెలియజేశారు. తాజాగా మహేష్ బాబు కూడా ఈ ఘటనపై తన రియాక్షన్ తెలియజేశాడు. అయితే అందరిలా కాకుండా ఈయన ఒక వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మహేష్ బాబు తన మాటల రూపంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై తన స్వరాన్ని అరువిచ్చాడు. ప్రస్తుతం ఇది వైరల్ మారుతోంది.

ఎవరి కళ్లలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో..ఎవరి మాట మన్ననగా ఉంటుందో..
ఎవరి మనసు మెత్తగా ఉంటుందో..
ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో..
ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం.. సమాజంలో గౌరవం ఉంటాయో.. ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకి విలువిస్తారో.
వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో..
ఎవరి మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో..
స్త్రీకి శక్తింది.. గుర్తింపు, గౌరవం ఉండాలని ఎవరు అనుకుంటారో..
ఎవరికి దగ్గరగా ఉంటే.. వాళ్లకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో..
అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, ఆత్మీయుడు, సహచరుడు..
ఒక్క మాటలో చెప్పాలంటే.. వాడే మగాడు.. ఈ వాక్యాలతో ఉన్న పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

More Related Stories