English   

విజయ్ దేవరకొండ ని అవమానించిన హీరోయిన్

vijayd
2019-12-01 16:36:57

తెలుగులో ఇప్పుడు స్టార్ హీరో హోదా అనుభవిస్తున్నాడు విజయ్, పెళ్లి చూపులు సినిమాతో ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారాడు ఈ హీరో ఆ తర్వాత రెండు హిట్స్ కొట్టడంతో మనోడి జోరును ఎవరూ ఆపలేక పోయారు. రౌడీ అంటూ ఒక బ్రాండ్ పెట్టేసి వ్యాపారస్తుడు కూడా అయిపోయాడు. అయితే ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా దెబ్బేసింది అనుకోండి అది వేరే విషయం. అయితే అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో రిలీజ్ అయినప్పుడు పెద్ద రచ్చే జరిగింది. అయితే ఎవరేమన్నా ప్రెస్ మీట్ లు పెట్టో సోషల్ మీడియాలోనో విమర్శలు చేసారు. దానికి విజయ్ కూడా ఆయా సినిమా ఈవెంట్స్ లో వాటి మీద ఖండన స్టేట్మెంట్ లు తనదైన స్టైల్ లో ఇస్తూ  పోయాడు. కానీ మనోడిని స్టేజ్ మీదనే మీడియా ముందే అవమానించింది ఒక లీడింగ్ హీరోయిన్. ఓర్నీ ఇదేంటా అనుకుంటున్నారా ? అసలు విషయం ఏంటంటే, అన్ని భాషలకి చెందిన యువ సంచలనాలను బాలీవుడ్ క్రిటిక్ అనుపమా చోప్రా ఒక ఇంటర్వ్యూ, అంటే ఇంటర్వ్యూ అనడం కంటే డిస్కషన్ అనడం బెటరేమో ?. ఈ డిస్కషన్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ కి ఆయన సినిమానే ఏకిపారేసి షాకిచ్చింది మళయాళ హీరోయిన్ పార్వతి మీనన్.

నిజానికి అర్జున్ రెడ్డి సినిమాలో హీరో కొన్ని సన్నివేశాల్లో హీరోయిన్‌ ని కొడతాడు. సినిమాలో ఉన్న అలాంటి సన్నివేశాలు మహిళలపై హింసను ప్రేరేపిస్తున్నట్టుగా ఉన్నాయని ఒక నటిగా అలాంటి సన్నివేశాలు తెరకెక్కించొద్దని దర్శకుడికి చెప్పలేను కానీ, అలాంటి సినిమాల్లో నటించడానికి నేను దూరంగా ఉంటానని పార్వతి విజయ్ ముందే వ్యాఖ్యానించింది. విజయ్ ఎదురుగానే `అర్జున్‌రెడ్డి`ని విమర్శించిన పార్వతిపై కొందరు నెటిజన్లు  ప్రశంసలు గుప్పిస్తున్నారు. అయితే అప్పుడు సైలెంట్ గానే ఉన్న విజయ్ తాజాగా గోవాలో జరిగిన అయిఫై  స్వర్ణోత్సవ వేడుకలకు హాజరైన సందర్భంగా పార్వతి వ్యాఖ్యలపై స్పందించాడు.  పార్వతి వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..‘ఈ విసహాయం మీద చాలా చిరాగ్గా ఉంది. అర్జున్ రెడ్డి’ సినిమాపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే కొందరు నిజాయతీగా సమాజం గురించి ఆలోచిస్తూ  ప్రశ్నలు వేసిన వారు ఉన్నారు. అలాగే పార్వతి కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. అందుకు నాకు ఆమెపై ఎలాంటి కోపం లేదు. కానీ, నాకు కోపం వచ్చేది ఎక్కడంటే..సోషల్ మీడియాలో ఈ సినిమాపై జరుగుతున్న హడావుడి. నెటిజన్స్ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అసలు వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకావడంలేదు. ఆ ఇంటర్వ్యూ అడ్డుపెట్టుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది నాకు నచ్చడంలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

 

More Related Stories