English   

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న మరో నటి

mali
2019-12-01 19:07:05

ఈ మధ్య సినిమా వాళ్ళ పెళ్ళిళ్ళు ఎక్కువయ్యాయి. బాలీవుడ్లో మంచి ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ లు దీపిక పడుకొనే, అనుష్కలు సైతం త‌మ‌  మనసుకు నచ్చిన వాళ్లని పెళ్లి చేసుకుని అటు కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే  ఇటు సినిమాల్లోనూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. మన వాళ్ళు కూడా ఒక్కొక్కరు పెళ్లి చేసుకుని జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. టాలీవుడ్ లో కొద్ది రోజుల క్రితమే నటి అర్చన పెళ్లి మరువక ముందే మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది అది కూడా పెద్దగా హడావిడి లేకుండా. ఆ హీరోయిన్ ఎవరో కాదు మ‌నాలి రాథోడ్‌. ఓర్నీ ఎవరీమె అనుకుంటున్నారా ? గతంలో వంశీ తీసిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది మనాలీ రాధోడ్. ఆ మూవీ తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు.

ఆ తర్వాత చేసిన గ్రీన్ సిగ్నల్, ఓ స్త్రీ రేపు రా వంటి చిత్రాలు కూడా ఆమె కెరీర్ లో ఫ్లాపులుగా నిలిచాయి. కోలీవుడ్ కు వెళ్లి లక్ చెక్ చేసుకున్నా అక్కడ కూడా కాలం కలిసి రాలేదు. ఇన్నాళ్లూ ఎలా గోలా నెట్టుకొచ్చిన ఈమె ఇప్పుడు పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్త రవి ఇజ్జార్ అనే ఆయనను పెళ్లాడింది. రాజశేఖర్, జీవిత, హేమ, క్రిష్ లాంటి పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఈ వివాహానికి హాజరయ్యారు.

More Related Stories