English   

ఆ కుర్ర దర్శకుడితో విజయ్ సినిమా...మళ్ళీ తెర మీదకి

vijay
2019-12-01 19:34:56

డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావడంతో సైలెంట్ అయిన విజయ్ దేవరకొండను బాలీవుడ్ మీడియా మాత్రం వదలడం లేదు. విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ఇస్మార్ట్ హిట్ తో ఉన్న పూరి తో చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ మూవీ లో నటిస్తున్న విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ సినిమా (ఫైటర్.. వర్కింగ్ టైటిల్) తర్వాత మరో యంగ్ డైరెక్టర్ కి కమిట్ అయినట్లుగా చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. అందరూ కొత్త కుర్రాళ్లనే పెట్టుకుని హుషారు అనే కామెడీ ఎంటెర్ టైనర్ సినిమా తీసి ఆకట్టుకున్న శ్రీహర్ష కోనుగంటికి విజయ్ దేవరకొండ ఓ సినిమాకి కమిట్ అయ్యాడని మళ్ళీ ప్రచారం మొదలయింది. హుషారు సినిమాకి హిట్ టాకొచ్చినా సినిమాకి కావాల్సిన ప్రమోషన్స్ లేక సినిమా సూపర్ హిట్ కాలేకపోయింది.

ఇక ఈ దర్శకుడు అప్పటి నుండి ఖాళీగానే ఉండి తాజాగా ఓ స్టోరీ లైన్ తీసుకుని వెళ్లి విజయ్ దేవరకొండకు వినిపించాడట. ఈ కథ ప్రకారం ఫారెన్ లో పెరిగిన ఓ ఎన్నారై యువకుడు కొన్ని ప్రత్యేకమైన పరిస్దితుల్లో మారుమూల పల్లెటూరులో బతకాల్సి వస్తోందట. ఆ క్రమంలో హీరో ఎదురుకునే సమస్యలు, సంఘటనలు దాని మీద బేస్ చేసుకని కామెడీ ఉంటుందట. పూరీ తో సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమాను చేస్తారని అంటున్నారు. మరోపక్క మరో ప్రచారం ప్రకారం పూరీ సినిమా తర్వాత విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడంటున్నారు. మరి చూద్దాం ఏ ప్రాజెక్ట్ ముందుగా పట్టాలెక్కుతుందో.

 

More Related Stories