English   

బీజేపీలో చేరిన మరో హీరోయిన్....

bjp
2019-12-02 06:16:29

దేశంలో మోడీ మానియా గట్టిగా నడుస్తోంది. దీంతో ఆ పార్టీలోకి చేరికలు వెల్లువలా సాగుతున్నాయి. తాజాగా  ప్రముఖ నటి నమిత బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో నిన్న ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు మరింత కొంత మంది కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దక్షిణాదిన పలు భాషల్లో నటించిన నమిత తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. గతకొంత కాలంగా సినిమాల్లో అవకాశం లేకపోవడంతో రాజకీయాల వైపు అడుగులు వేసింది. తెలుగు, తమిళంలో సరైన సినిమా అవకాశాలు లేకపోవడంతో సినీ నటి నమిత కొన్నేండ్ల కిందటే దివంగత నేత జయలలిత సమక్షంలో ఆమె 2016లో అన్నాడీఎంకే పార్టీలో చేరారు. తాజాగా ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

ఆమె వెంట తమిళనాడు బీజేపీ నేతలు ఉన్నారు. తమిళనాట అధికారంలోకి రావాలని కలలుగంటున్న బీజేపీకి నమిత పార్టీలో చేరడంతో ఆమె ఇమేజ్ కొంచెం అన్నా కలిసివస్తుందేమో చూడాలి. నిజానికి తమిళనాడులో నమితకు భారీ సంఖ్యలో అభిమానులున్నారు. అందరు బొద్దుగుమ్మలు లానే గతంలో ఆమెకు ఒక గుడిని కూడా కట్టారు. గుజరాత్ కు చెందిన నమిత సినీ రంగంలో తనను ఆదరించిన తమిళనాడు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ఆమె తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే తమిళంలో ఎంతో మంది నటీనటులు రాజాకీయ రంగప్రవేశం చేసినా అందరికీ కలసి రాలేదు మరి ఆమెకు ఈమేరకు కలసి వస్తుందో చూడాలి మరి.

 

More Related Stories