English   

హాస్పిటల్ పాలైన బిగ్ బాస్ కంటెస్టెంట్.. నిర్వాహకులు షాక్..

biggboss
2019-12-02 06:25:44

బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులకు తెలియక ముందే ఇండియన్ ఆడియన్స్ కు బాగా పరిచయం అయిన రియాల్టీ షో ఇది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన తర్వాత దీన్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు నిర్వాహకులు. మూడేళ్లుగా తెలుగులో కూడా బిగ్ బాస్ షో కి మంచి అప్లాజ్ వస్తోంది. ఇదిలా ఉంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది కానీ హిందీలో మాత్రం బిగ్ బాస్ 13వ సీజన్ ఇంకా నడుస్తూనే ఉంది. అక్కడ వస్తున్న ప్రజాదరణ చూసి మరో ఐదు వారాలు పొడిగించారు కూడా. సల్మాన్ ఖాన్ గత కొన్నేళ్లుగా బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్నాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 13వ సీజన్లో కంటెస్టెంట్ గా ఉన్న టీవీ హీరోయిన్ దేవోలీనా భట్టాచార్య సో మధ్యలోనే ఎలిమినేట్ అవుతుంది. కొన్ని రోజులుగా తీవ్రమైన వెన్ను నొప్పితో బాధ పడుతున్న దేవోలినా.. తనంతట తానే సెల్ఫ్ ఎలిమినేట్ కాబోతుంది. ఇకపై ఈ షోలో పాల్గొనడానికి తనకు ఆరోగ్యం సహకరించడం లేదని నిర్వాహకులకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దానికి తోడు ఈ మధ్య ఓ టాస్క్‌లో పాల్గొన్న సమయంలో దేవోలీనాకు వెన్నునొప్పి కలిగింది.

దాంతో ఆమె అప్పటి నుంచి ఏ టాస్క్‌లోనూ పాల్గొనడం లేదు. బిగ్‌బాస్‌ కూడా ఆమె విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. హౌజ్‌మేట్స్‌ చేసే పనుల్లో పాల్గొనలా వద్దా అనే నిర్ణయాన్ని ఆమెకే వదిలేశాడు. అయితే ఈ వెన్నునొప్పి రోజురోజుకు ఎక్కువ అవుతుందని అంతో ఇకపై ఇంట్లో కొనసాగడం కష్టమని నిర్ణయించుకుంది ఆ టెలివిజన్ నటి. ఇక వెంటనే స్పందించిన బిగ్‌బాస్‌ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాతా తిరిగి షోలోకి వస్తుందని అనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఆమె ఆరోగ్యం ఇప్పట్లో కుదుటపడేలా కనిపించడం లేదు. అందుకే లో నుంచి బయటికి రావడం నయం అని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఉన్న బిగ్ బాస్ 13వ సీజన్లో దేవోలీనా భట్టాచార్య స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌. బయట కూడా ఆమెకు పుల్‌ సపోర్ట్‌ ఉంది. ఇలాంటి సమయంలో అనుకోకుండా అనారోగ్యం కారణంగా ఆమె నుంచి బయటకు రావడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

More Related Stories