English   

పవన్ కళ్యాణ్ సినిమాను వరుణ్ తేజ్ రీమేక్ చేస్తున్నాడా..

pk
2019-12-02 19:48:40

ఏమో ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా టైటిల్ వాడుకొని ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు వరుణ్ తేజ్. ఇక ఇప్పుడు బాబాయ్ సినిమాను రీమేక్ చేయాలని ఈ కుర్రహీరో భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన అల్లు అరవింద్ ప్రొడక్షన్ లో కిరణ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి అల్లు బాబి నిర్మాత. ఇదిలా ఉంటే ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. తెలుగులో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులో జానీ సినిమా కూడా ఒకటి. అప్పట్లో పవన్ కళ్యాణ్ వరుస విజయాలతో ఉన్నప్పుడు స్వయంగా దర్శకత్వం వహించి నటించిన సినిమా ఇది. కథ చాలా ఎమోషనల్ గా ఉన్నా కూడా ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవడంతో ప్లాప్ అయింది.

అయితే ఈ సినిమాను కాస్త మార్చి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే.. స్క్రీన్ ప్లే లో కొన్ని మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా సినిమా సంచలన విజయం సాధించి ఉండేదని అప్పట్లో విశ్లేషకులు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ ఇదే చేయబోతున్నాడని తెలుస్తోంది. జానీ సినిమా కథను తీసుకొని దాన్ని తన ఇమేజ్ కు తగ్గట్టుగా మార్చి మరింత ఎమోషనల్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన కూడా బాక్సర్ గా నటించబోతున్నాడు. దీని కోసం అమెరికా వెళ్లి ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు వరుణ్ తేజ్. ఇక ఇందులో వరుణ్ తేజ్ తండ్రిగా హీరో మాధవన్ నటించబోతున్నాడు. తల్లిగా రమ్యకృష్ణ కనిపించబోతుంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత జానీ గుర్తుకు వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అప్పట్లో బాబాయ్ మిస్సయిన టార్గెట్ ఇప్పుడు అబ్బాయి అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ విషయంలో వరుణ్ తేజ్ ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి. ఈ మధ్యే గద్దలకొండ గణేష్ సినిమాతో మంచి విజయం అందుకొన్నాడు ఈ హీరో.

More Related Stories