English   

శ్రీదేవి జీవిత చరిత్ర ఆధారంగా బుక్ రిలీజ్‌

deepika
2019-12-02 20:08:08

కొన్ని వందల సినిమాలలో నటించి అతిలోక సుందరిగా ఎందరో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి శ్రీదేవి. గతేడాది ఫిబ్రవరిలో ఆమె మృతిచెందారు. అయితే తాజాగా ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ పుస్తకాన్ని రచించారు. ప్రముఖ రచయిత సత్యార్థ్‌ నాయక్‌ ‘శ్రీదేవి: ది ఎటెర్నల్‌ స్ర్కీన్‌ గాడెస్‌’ పేరుతో ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలోని ముందు మాటను ప్రముఖ బాలీవుడ్‌ నటి కాజోల్‌ రాశారు. దీని గురించి ఓ సందర్భంలో కాజోల్‌ మాట్లాడుతూ.. ‘శ్రీదేవి నటనా జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆమె సినిమాలను చూస్తూ పెరిగాను. నటనలో ఆమె ఒక ఇన్‌స్టిట్యూట్‌’ అని ఆమె ఆ ముందు మాటలో పేర్కోన్నారు. నిన్న ఈ పుస్తకాన్ని బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌  హాజరయ్యారు. పుస్తక విడుదల కార్యక్రమం డిల్లీలో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు పాల్గొన్నారు.

More Related Stories