English   

పడుకుంటేనే అవకాశం అన్నారట !

isha
2019-12-03 04:52:11

కాస్టింగ్ కౌచ్ అనగానే మనకి నటి శ్రీరెడ్డి గుర్తుకు వస్తుంది.  తెలుగు లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని ఎంతో మంది అమాయక అమ్మాయిలు కొంత మంది దళారుల చేతుల్లో పడి దారుణంగా మోసపోతున్నారని శ్రీరెడ్డి ఎలుగెత్తింది. తాను కూడా కొంత మంది సెలబ్రెటీల చేతుల్లో మోసపోయానని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం నేపథ్యంలో తనూ శ్రీ దత్త, కంగనా రౌనత్ లాంటి వారు గతంలో తమపై జరిగిన లైంగి వేధింపులపై గళమెత్తారు.   తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఇషా కొప్పికర్. తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి చెప్పింది ఈమె. కొన్ని సినిమాలు చేసి ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇషా.. తనకు ఎదురైన కొన్ని అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ఆమె ఓ సినిమాకు సైన్ చేసినపుడు ఆ నిర్మాత కాల్ చేసి తనను హీరోకు సపరేట్‌గా ఫోన్ చేయమన్నాడని చెప్పింది. సరే అని తాను ఆ హీరో గారికి కాల్ చేస్తే ఆయన తనను ఒంటరిగా రూమ్‌కు వచ్చి కలవామన్నాడట. అయితే తాను ఎందుకో అనుకున్నానని కానీ తర్వాత సీన్ అర్థమైపోయి అక్కడ హీరోనే కాదు సినిమానే వదిలేసుకున్నానని చెప్పింది ఇషా. ఆ తర్వాత హీరోకు వార్నింగ్ కూడా ఇచ్చానని ఇకపై ఇలాంటి పిచ్చి పనులు చేస్తే జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చిందట. ఇంత చెప్పిన ఆమె ఆ హీరో ఎవరో మాత్రం చెప్పలేదు.

 

More Related Stories