English   

యాంకర్ శ్యామల ఎక్స్‌పోజింగ్ చేయకపోవడానికి కారణం అదే..

anchor
2019-12-03 05:01:50

తెలుగులో ఉన్న హాట్ యాంక‌ర్స్ లో శ్యామ‌ల కూడా ఒక‌రు. ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తూనే.. చీర‌లోనే అందాలు ఆర‌బోస్తుంది ఈ భామ‌. పెళ్లి త‌ర్వాత కూడా హాట్ షోతో మ‌తులు పోగొడుతుంది. అన‌సూయ‌, ర‌ష్మి రేంజ్ లో కాక‌పోయినా.. శ్యామ‌ల‌కు కూడా మంచి ఫాలోయింగే ఉంది. ఇక ఇప్పుడు ఈ భామ కొన్ని నిజాల‌ను బ‌య‌ట పెట్టింది. శ్యామ‌ల కెరీర్ ఆరంభ‌మైంది వంట‌ల కార్య‌క్ర‌మంతోనే. ఓ ఛానెల్ వ‌చ్చే మా ఊరి వంట‌తో రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేది శ్యామ‌ల‌. అందులో చేసే వంట‌ల్ని రుచి చూసి అబ్బో అమోఘం.. అద్భుతం అంటూ కితాబిచ్చేది. అయితే అక్క‌డ నిజంగా వండిన వంట‌ల్ని తాను ఏ రోజు తిన‌లేద‌ని చెప్పింది శ్యామ‌ల‌. తన వెంట తెచ్చుకున్న చాక్లెట్స్, బిస్కెట్స్ తిని.. అక్క‌డ చేసిన వంట‌ల్ని తిన్న‌ట్లు బిల్డ‌ప్ ఇచ్చేదాన్నంటూ నిజాన్ని ఒప్పేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇది ఓ ర‌కంగా ప్రేక్ష‌కుల్ని మోసం చేయ‌డ‌మే అని చెప్పిన శ్యామ‌ల‌.. కెరీర్ లో ఇవ‌న్నీ మామూలే అంటూ మ‌రో ట్విస్ట్ ఇచ్చింది. ఇక ఎక్స్ పోజింగ్ చేయాలని తనకున్నా కూడా ఫ్యాన్స్ తిడుతున్నారని అందుకే తాను గ్లామర్ షోకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ.

దానికితోడు తను హీరోయిన్ గా ఎందుకు మారలేదో కూడా చెప్పింది ఈ ముద్దుగుమ్మ. అందంగా ఉంటుంది కాబట్టి ఈమెకు కొందరు హీరోయిన్ ఆఫర్స్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. కానీ ఆమె హీరోయిన్ కాకపోవడానికి కారణం తనే అని.. హీరోయిన్‌గా ఉండాలంటే బిజీ అయిపోవాలని చెబుతుంది. కానీ తను అంత బిజీగా ఉండలేనని.. అన్నింటికంటే ముఖ్యంగా తనకు తిండి నిద్ర అంటే ప్రాణం అంటుంది శ్యామల. కానీ హీరోయిన్ అయితే ఆ రెండు ఉండవని చెబుతుంది ఈమె. సినిమా హీరోయిన్ కావాలంటే చాలా బాధ్యతగా ఉండాలి.. దానికి మించి గ్లామర్ షో కూడా కోరుకుంటారు. అది తాను చేయలేనని.. అందాలు ఆరబోయడంతో పాటు స్లిమ్ గా ఉండటం అనేది తన వల్ల కాదని అందుకే హీరోయిన్ అవకాశాలు వచ్చినా కూడా చేయలేదని నిజం ఒప్పేసుకుంది శ్యామల. ప్రస్తుతం కారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయింది ఈ యాంకర్.

More Related Stories