దిశ కేసు తర్వాత నిత్య కామెంట్ల కలకలం

2019-12-03 05:27:05
దక్షిణాదిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి నిత్యా మీనన్. మళయాళీ భామ అయిన కూడా తాను ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాష నేర్చుకొని తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం నిత్యా గొప్పతన అనే చెప్పాలి. అభినవ సౌందర్య అనిపించుకునే దిశ ఉదంతం జరిగిన నేపధ్యంలో తన కెరీర్ తొలినాళ్లలో అనుభవించిన వేధింపుల విషయాల గురించి వెల్లడించడం సంచలనంగా మారింది. తాజాగా గోవా ఫిలిం ఫెస్టివల్ లో వేధింపుల గురించి మాట్లాడిన నిత్యా మీనన్ తనకి జరిగిన అనుభవాన్ని పంచుకుంది. తనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని, అయితే చెడుగా ప్రవర్తించిన వాళ్లను పిలిచి బయటకు పొమ్మని హెచ్చరించానని నిత్యా వెల్లడించారు. మీకు గౌరవం అవసరం లేదా? అది మిగలాలంటే చెడు ప్రవర్తన వద్దు అని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు.