English   

దేవి శ్రీ ప్రసాద్ కు ఏమైంది.. సరిలేరు నీకెవ్వరులో ఏంటా పాట..

devisriprasad
2019-12-03 05:37:01

తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వీలైనంతవరకు మంచి మ్యూజిక్ అందరినీ అలరిస్తున్న సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. ఆయన నుంచి ఒక పాట వచ్చింది అంటే కచ్చితంగా అది బాగుంటుంది అని మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు అభిమానులు. కానీ ఇప్పుడు ఆ నమ్మకాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటున్నారు దేవి. తాజాగా ఆయన మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గతంలో ఈయనతో కలిసి పనిచేసిన నేనొక్కడినే, శ్రీమంతుడు, మహర్షి లాంటి సినిమాలకు మంచి సంగీతం ఇచ్చాడు డిఎస్పి. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమా విషయంలో మాత్రం ఎందుకో తెలియదు దేవి శ్రీ ప్రసాద్ తడబడుతున్నట్లు కనిపిస్తోంది. టైటిల్ సాంగ్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. మహేష్ బాబు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది ఈ పాట.

ఇక డిసెంబర్ ఐదు సోమవారాలు ఐదు పాటలు విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. దానికి తగ్గట్లుగానే తొలి సోమవారం మైండ్ బ్లాక్ అంటూ ఒక పాటను విడుదల చేశారు. ఈ పాట విన్న తర్వాత మహేష్ బాబు అభిమానులకు.. సాధారణ ప్రేక్షకులకు నిజంగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. అయితే అది పాజిటివ్ వైబ్రేషన్ కాదు నెగిటివ్ వైబ్రేషన్ లో. దేవి శ్రీ ప్రసాద్ కి ఏమైంది.. ఎందుకు ఇలా సంగీతం అందించారు అంటూ ఆయనపై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. టైటిల్ సాంగ్ ఎలాగూ యావరేజ్.. కనీసం ఇప్పుడు విడుదలైన మాస్ సాంగ్ అయినా అదిరిపోతుంది అనుకుంటే ఇది కూడా సోసోగానే ఇచ్చాడు దేవి శ్రీ ప్రసాద్ అంటూ నిట్టూరుస్తున్నారు అభిమానులు. ఇంకా నాలుగు సోమవారాలు నాలుగు పాటలు విడుదల కానున్నాయి. కనీసం వాటికైనా మంచి ట్యూన్స్ ఇచ్చి ఫ్యాన్స్ అంచనాలను దేవి శ్రీ ప్రసాద్ అందుకుంటాడేమో చూడాలి.

More Related Stories