English   

అల్లు అర్జున్ సినిమాతో మారిపోయిన తమన్ రేంజ్..

Thaman
2019-12-03 11:23:57

తెలుగు ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా తమన్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. అందులో ప్రతిసారి దేవి ముందుండేవాడు. కానీ ఈ ఏడాది మాత్రం తమన్ సత్తా చూపిస్తున్నాడు. ఈమధ్య విడుదలైన అల వైకుంఠపురంలో పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో తమన్ రేంజి ఒక్కసారిగా పెరిగిపోయింది. 

ముఖ్యంగా ఈ సినిమాలో సామజవరగమనా పాట ఏకంగా 100 మిలియన్ వ్యూస్ అందుకోవడం సరికొత్త చరిత్రకు నాంది పలికింది. సౌత్ ఇండియాలో ఇంత వేగంగా 100 మిలియన్ వ్యూస్  అందుకున్న పాట ఇదే. దానికి తోడు రాములో రాముల కూడా దుమ్ము దులిపేస్తుంది. ఈ రెండు పాటలకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఇప్పుడు అల వైకుంఠపురంలో నిర్మాతలకు తమన్ ఒక స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడని తెలుస్తోంది. తనపై ఒక స్పెషల్ సాంగ్ వీడియో చెయ్యాలని.. అందుకోసం ఒక స్పెషల్ సెట్ వెయ్యాలని అడిగినట్లు ప్రచారం జరుగుతుంది. తమన్ కోరిక తీర్చాలంటే నిర్మాతలకు కూడా తడిసి మోపెడు కావడంతో వారు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో మళ్లీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అడిగిన ఆ స్పెషల్ వీడియో సాంగ్ అవసరమా అని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 

బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల తర్వాత ఇప్పుడు అల వైకుంఠపురంలో వస్తుంది. ఈ సినిమాలో అక్కినేని మేనల్లుడు సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడుమ్ కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోతాడు సుశాంత్. చాలా ఏళ్ల తర్వాత టబూ ఈ సినిమాతో మళ్ళీ తెలుగు సినిమాలలోకి తిరిగి వచ్చింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నా పేరు సూర్య ఫ్లాప్ కావడంతో అల్లు అర్జున్ కెరీర్లో అల వైకుంఠపురంలో విజయం కీలకంగా మారింది.

More Related Stories