English   

త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు మధ్య వాటాల చిచ్చు..

Pink Telugu Remake
2019-12-03 11:55:25

త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు.. తెలుగు ఇండస్ట్రీలో బాగా పేరున్న వ్యక్తులు. ఇద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకరు దర్శకత్వంలో అగ్రగణ్యులు అయితే మరొకరు నిర్మాణంలో సిద్ధహస్తులు. అయితే ఇద్దరి మధ్య ఇప్పుడు కొద్దిగా వాటాల చిచ్చు రేగిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయినా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి మధ్య ఎలాంటి వాదన.. వివాదం వస్తుందో చెప్పడం అంత ఈజీ కాదు. తాజాగా త్రివిక్రమ్, దిల్ రాజు మధ్య కూడా ఇలాంటి ఒక కాంట్రవర్సీ వచ్చిందని ప్రచారం జరుగుతుంది. 

ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు దిల్ రాజు. అలాంటి సమయంలో పింక్ సినిమాను తెలుగులో పవన్ తో రీమేక్ చేసే అవకాశం అందుకున్నాడు ఈ నిర్మాత. ఈ రీమేక్ విషయంలో నటించడానికి పవన్ కళ్యాణ్ ను ఒప్పించడానికి త్రివిక్రమ్ కు ఎటువంటి పెట్టుబడి లేకుండా కేవలం రైటర్ గానే యాభైశాతం లాభాలు ఇస్తానని మాట ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాను పవన్ ఓకే చెప్పిన తర్వాత దిల్ రాజు కొన్ని తెలివితేటలు చూపించి త్రివిక్రమ్ ను తనంతట తాను సినిమా నుంచి బయటకు వచ్చేలా చేశారని తెలుస్తోంది. 

ప్రస్తుతం ఇవే వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ తప్పుకున్న తర్వాత వేణు శ్రీరామ్ కు ఈ చిత్ర బాధ్యతలు అప్పగించారు దిల్ రాజు. తన కంపౌండ్ లోనే ఉన్న దర్శకుడు కాబట్టి ఆయన గురించి బాగా తెలుసు.. త్రివిక్రమ్ సహాయం లేకపోయినా వేణు శ్రీరామ్ ఖచ్చితంగా పింక్ సినిమా రీమేక్ అద్భుతంగా తెరకెక్కిస్తారని నమ్ముతున్నాడు. జరుగుతున్న విషయాలను దగ్గర్నుంచి గమనించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇక అక్కడ తన అవసరం లేదని తనంతట తానుగా బయటికి వచ్చేసినట్లు ఇండస్ట్రీలో గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా పూర్తి చేస్తాడా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. తనకు కచ్చితంగా త్రివిక్రమ్ కావాల్సిందే అని పట్టుబడితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది పింక్ సినిమా రీమేక్.

More Related Stories