English   

దూకుడు పెంచిన ఇస్మార్ట్ పోరి నభా నటేష్..

Nabha Natesh
2019-12-03 16:25:20

నభా నటేష్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కొన్నిసార్లు హిట్ సినిమాలతో ఇండస్ట్రీకి రాకపోవచ్చు. కానీ వచ్చిన తర్వాత హిట్లు మాత్రం వారిని వెతుక్కుంటూ వస్తాయి. కొందరు హీరోయిన్ల జాతకం అలా ఉంటుంది. వాళ్ల తొలి సినిమా ఎలా ఉన్నా కూడా తర్వాత మాత్రం వరస అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నభా నటేష్ విషయంలో ఇదే జరుగుతుంది. నన్ను దోచుకుందువటే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన నభా.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంలో ఇప్పుడు తెలుగులోనే పాగా వేయాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. దానికితోడు వరుస అవకాశాలు ఈమె కోసం క్యూ కడుతున్నాయి. 

ఇప్పుడు రవితేజ డిస్కోరాజా సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ. కన్నడ ముద్దుగుమ్మ కాబట్టి తెలుగు విషయంలో పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు సినిమాలకు కమిట్ కావడానికి ఆలోచిస్తుంది నటేష్. సాయి ధరం తేజ్ హీరోగా  కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కుతున్న సోలో బ్రతుకే సో బెటరూ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.  దాంతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాల్లో కూడా ఈమె హీరోయిన్.  

ఇక వరుణ్ తేజ్ కొత్త సినిమాలో కూడా హీరోయిన్ గా తీసుకుంటున్నారు. ఒకే సారి ఇన్ని సినిమాలు లైన్ లో ఉండగానే గ్లామర్ షో విషయంలో కూడా అమ్మడు ఫుల్ కోపరేట్ చేస్తుంది. హై రేంజ్ అందాల ఆరబోతతో ఔరా అనిపిస్తుంది నభా. ఈ మధ్యే విడుదలైన ఓ ఫోటోషూట్ లో అమ్మాయి థైస్ చూపిస్తూ మైమరిపించింది. ఇక మొన్నటికి మొన్న చాలా పద్దతిగా మారిపోయి కంటిచూపుతోనే సైగలతో ప్రాణాలు తీస్తుంది నభా నటేష్. ఇక ఇప్పుడు నడుము సోయగాలు చూపిస్తూ ఔరా అనిపిస్తుంది. మొత్తానికి ఈ భామ దూకుడు చూస్తుంటే మరికొన్ని రోజుల్లో స్టార్ హీరోల దృష్టిలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.

More Related Stories