డేంజర్ లో పడిపోయిన విజయ్ దేవరకొండ కెరీర్..

నెల రోజుల కింద వరకు కూడా విజయ్ దేరవకొండ అంటే ట్రెండ్ సెట్టర్. ఆయన నటిస్తే సినిమా హిట్ అంతే.. కనీసం గెస్ట్ రోల్ చేసినా కూడా చరిత్ర సృష్టిస్తాడు.. దానికి మహానటి సాక్ష్యం. ఇక గీతగోవిందం అంటే ఏకంగా 70 కోట్ల షేర్ తీసుకొచ్చి.. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇంతగా ఫాలోయింగ్ పెంచుకున్నాడు విజయ్. మధ్యలో వచ్చిన నోటా సినిమా ఫ్లాప్ అయినా కూడా మళ్లీ టాక్సీ వాలా సినిమాతో తనేంటో నిరూపించుకున్నాడు విజయ్ దేవరకొండ. కానీ ఈ ఏడాది విడుదలైన డియర్ కామ్రేడ్ సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు విజయ్ కెరీర్ డైలమా లో పడిపోయింది.
ఈ సినిమాకు తొలి రోజు నెగటివ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే కలెక్షన్లు పడిపోవడం మొదలుపెట్టాయి. డిస్ట్రిబ్యూటర్ లను డియర్ కామ్రేడ్ సినిమా దారుణంగా ముంచేసింది. విజయ్ కూడా నార్మల్ హీరోనే.. సూపర్ మ్యాన్ కాదంటూ నీరు కార్చేసాయి. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత ఇప్పుడు క్రాంతి మాధవ్ సినిమాపై కూడా అంచనాలు తగ్గిపోతున్నాయి. ఈ డైరెక్టర్ కు ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు. కానీ విజయ్ దేవరకొండ ఇమేజ్ ను నమ్ముకుని క్రాంతిమాధవ్ ఒక లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఫైటర్ అనే సినిమాకు కమిట్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.
ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరవాత పూరి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే పూరి ఎప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో ఎవరికీ తెలియదు కాబట్టి ఫైటర్ వచ్చేంతవరకు దానిమీద అభిమానులు కూడా పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. ఇలా అన్నీ రిస్కులు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఇందులో ఏది విజయ్ దేరవకొండ కోరుకున్న బ్లాక్ బస్టర్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక్క హిట్ పడినా కూడా మళ్లీ విజయ్ ఈజ్ బ్యాక్ అంటారు కానీ ఒక్క ప్లాప్ పడిందంటే నిజంగానే విజయ్ గోయింగ్ బ్యాక్ అంటారు. మరి చూడాలిక.. ఈ డైలమాలోంచి విజయ్ ఎలా బయటపడతాడో..?