English   

లీక్ అయిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కథ..

Sarileru Neekevvaru
2019-12-03 18:13:32

మహేష్ బాబు ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై అభిమానుల్లో భారీ ఆశలు పెట్టుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస విజయాలతో జోరుమీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే సరిలేరు నీకెవ్వరు కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. 

ఈ సినిమాలో మేజర్ అజయ్ కృష్ణ(మహేష్ బాబు) బార్డర్ లో పోరాడే ఒక సైనికుడు. అనాథ అయిన అజయ్ కు సత్యదేవ్ తో స్నేహం ఏర్పడుతుంది. ఒక అటాక్ లో అజయ్ స్నేహితుడు చనిపోతాడు. అతను చనిపోయే ముందు తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెబుతాడు. రాయలసీమలో జరుగుతున్న అన్యాయాల్ని.. ఎదుర్కొంటూ పోరాడుతూ ఉంటుంది విజయశాంతి. ఈమె సత్యదేవ్ కు తల్లి. తనని క్షేమంగా చూసుకోమని చెబుతూ చనిపోతాడు మహేష్ స్నేహితుడు సత్యదేవ్. అలా రాయలసీమకు బయల్దేరుతున్న సమయంలో ట్రైన్ లో హీరోయిన్ రష్మిక మందన్నను కలుస్తాడు మహేష్ బాబు. ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడతాడు. ఓవైపు తన ప్రేమ సంగతి చూసుకుంటూనే మరోవైపు స్నేహితుడికి ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోవడానికి మేజర్ అజయ్ కృష్ణతో ఏం చేశాడు.. రాయలసీమ వెళ్లి తన స్నేహితుడి తల్లి అయిన విజయశాంతికి ఎలా సహాయపడ్డాడు.. రాయలసీమలో అరాచకాల్ని అరికట్టి వాళ్లందరినీ ఎలా మంచిగా మార్చాడు అనేది మిగిలిన కథ అని తెలుస్తుంది. 

కథ పరంగా చూసుకుంటే రొటీన్ గానే అనిపిస్తున్నప్పటికీ.. కామెడీ, ఫైట్లతో అనిల్ రావిపూడి తనదైన శైలిలో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ కథ నిజమా కాదా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. అప్పటివరకు ఈ సస్పెన్స్ తప్పదు.

More Related Stories