English   

టెలివిజన్ లో దుమ్ముదులుపేసిన రాక్షసుడు టిఆర్పి..

sai
2019-12-03 19:20:33

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ అంటూ ఇలా ఎంతో ముందుకు వెళ్లిపోతున్నాం మనం. ఇలాంటి టైమ్ లో శాటిలైట్ రైట్స్ తీసుకుని సినిమాలు టెలికాస్ట్ చేస్తున్నా కూడా చానల్స్ కు వస్తున్న రేటింగ్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు కూడా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. కానీ ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమా టీవీలో బాగానే పర్ఫార్మ్ చేసింది. కెరీర్ మొదలుపెట్టిన ఐదేళ్ల తర్వాత తొలిసారి రాక్షసుడు సినిమాతో విజయాన్ని అందుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. తమిళనాట సూపర్ హిట్ గా నిలిచిన రాచసన్ సినిమాను తెలుగులో రీమేక్ చేశాడు ఈ హీరో. తొలిరోజే మంచి టాక్ ను సొంతం చేసుకున్న కూడా లాంగ్ రన్ లో ఈ సినిమా హిట్ అనిపించుకుంది. ఇక ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ సుమారు 6 కోట్ల రేంజ్ రేటు చెల్లించి సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమా ను టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు. మొదటి సారి టెలికాస్ట్ అయిన టైం లో పోటీలో కూడా రాక్షసుడు సినిమా కి మంచి TRP రేటింగ్ దక్కిందని చెప్పొచ్చు.

ఈ సినిమా 10.1 TRP రేటింగ్ మొదటి టెలికాస్ట్ దక్కగా ఛానెల్ TRP రేటింగ్ తో సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది, ఎందుకంటే సినిమా కాన్సెప్ట్ డిఫెరెంట్ అవ్వడంతో ఆ హత్యలు లాంటివి టెలివిజన్ లో చూస్తారో లేదో అనుకున్నా 10.1 TRP రేటింగ్ అంటే సినిమా జానర్ కి మంచి TRP రేటింగ్ అనే చెప్పాలి. పైగా బెల్లంకొండ శ్రీనివాస్ కుర్ర హీరో సినిమాకు 10 టిఆర్పి అంటే మంచిది అని లెక్క. ఈ సినిమాను కొన్న జెమినీ టీవీ మొదటి టెలికాస్ట్ లోనే చాలా వరకు పెట్టుబడి రికవరీ చేసుకోగా తర్వాత టెలికాస్ట్ లతో సినిమా వల్ల వాళ్ళు లాభాల పట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.

More Related Stories