English   

మంచు మనోజ్ ఆ విషయంలో ఒకే ఒక్కడు.. దిశ కు నివాళులు..

manchu
2019-12-03 19:47:45

తెలంగాణలో జరిగిన హేయమైన దిశ ఘటనను ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. అత్యంత దారుణంగా నలుగురు కర్కషులు ఆమెపై హత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది. ఇది జరిగి 5 రోజులు గడుస్తున్నా కూడా ఎవరికీ కనీసం మరుపు కూడా రావడం లేదు. ఇక దిశా ఇంటికి కూడా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వచ్చి వెళ్తున్నారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో హీరోలంతా సోషల్ మీడియాలో.. వీడియో రూపంలో తమ స్పందన తెలియ చేసారు. కానీ మంచు మనోజ్ మాత్రం హతురాలి ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చాడు.

టాలీవుడ్ నుంచి దిశా ఇంటికి వెళ్లి కుటుబ సభ్యులను పరామర్శించి ఓదార్చి వచ్చిన తొలి హీరో ఈయనే. దాంతో ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇలాంటి ఘటనలు జరగడం మాత్రం నిజంగానే సమాజానికి సిగ్గుచేటు అని.. మనుషులం అని చెప్పుకోడానికి కూడా సిగ్గుగా ఉందంటున్నాడు మనోజ్. దయచేసి అమ్మాయిలపై ఇలాంటి నీచమైన ఘటనలు చేయడం మంచిది కాదని.. ఏం చేసినా కూడా పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేమని.. నేరం చేసిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాలని తెలిపాడు మనోజ్. ప్రస్తుతం ఈయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. విడాకుల తర్వాత కాస్త బిజీ అయిపోయాడు మనోజ్. పైగా సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలపై కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నాడు మనోజ్.

More Related Stories