శశికళగా ఎన్టీఆర్ హీరోయిన్

దివంగత సీఎం జయలలిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా ఫస్ట్‌లుక్ ఈ మధ్యే విడుదలైంది. అమ్మ లుక్‌లో నటి కంగనా రనౌత్ ఏ మాత్రం గుర్తు పట్టలేని రీతిలో కనిపించారు. పచ్చ చీరలో అభివాదం చేస్తున్న బ్యానర్ ను ఈ ఫస్ట్ లుక్ లో చూపించారు. అయితే పోస్టర్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జయలలిత జీవితంలో ఎంతో ముఖ్య వ్యక్తి శశికళ. ఆమె పాత్ర ఎవరు చేస్తారా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉండగా ఆ పాత్ర కోసం నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణిని ఎంపిక చేసినట్టు సమాచారం. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తలైవీ చిత్రానికి హలీవుడ్‌కు చెందిన ప్రముఖ మేకప్‌మెన్ జోసన్ కాలిన్స్ పని చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా లో నటించినందుకు కంగనా రూ.20 కోట్లు పారితోషికాన్ని డిమాండ్ చేసిందని టాక్ నడుస్తుంది. వచ్చే ఏడాది జూన్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో జయలలితగా కంగన నటిస్తుండగా ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి కనిపించనున్నారు. ఈ సినిమాను విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.