అందరూ వస్తే నరేష్ కేమయ్యింది

ప్రతి రోజు షూటింగులతో బిజీగా ఉండే ఆర్టిస్టులు వనభోజనాలకి వెళ్ళారు. మా ఉపాధ్యక్షుడు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ నేతృత్వంలో హైటెక్ సిటీలోని టీఎస్ఐసీసీ పార్క్‌లో ఈ వనభోజనాలు జరిగాయి. కార్యక్రమానికి మా సభ్యులతో పాటు టీవీ, సినిమా రంగానికి చెందిన నటీనటులు హాజరయ్యారు. ఆటపాటలతో సందడిగా సాగిన ఈ కార్యక్రమానికిలో అలీ, హీరో కార్తికేయ, గిరిబాబు, రాజా రవీంద్ర, శివాజీరాజా మంగ్లీ, శివారెడ్డి తదితరులు సందడి చేశారు. ఈ కార్యక్రమం మొదలు కావడానికి ముందుఇటీవల దారుణ హత్యకి గురైన వెటర్నరీ డాక్టర్ దిశాకి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం నటి హేమ రూ. 25 వేల చెక్కును మా అసోసియేషన్‌కు విరాళంగా ఇచ్చారు. ముగ్గురు మా సభ్యులను దత్తత తీసుకుని వారికి సహాయం చేసేందుకు ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి ఏటా తను ఈ సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ వనభోజనాల్లో మా మెంబర్లు అంతా పాల్గొన్నారు. అయితే `మా` అధ్యక్షుడు నరేష్ మాత్రం హాజరు కాలేదు. `మా`లో తలెత్తిన అంతర్గత విబేధాలు కారణంగా ఆయన హాజరు కాలేదనే టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు నరేష్ కు సమాచారం అందించారుట. మీరు కూడా తప్పక రావాలని కోరారుట. కానీ ఆయన వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదట. వాస్తవానికి విబేధాలు తలెత్తిన నాటి నుంచి మా లో జీవిత వర్గానికి నరేష్ దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే.