English   

అఖిల్ తల్లిగా మరోసారి నాగార్జున హీరోయిన్..

akhil
2019-12-04 05:51:40

అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ కావడంతో ఎలాగైనా తొలి విజయం అందుకోవాలని ఆరాటపడుతున్నాడు అక్కినేని వారసుడు. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. దానికి తోడు గీతాఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ బొమ్మరిల్లు భాస్కర్ సినిమాను నిర్మిస్తుండటంతో కచ్చితంగా ఈ సినిమాతో మాయ చేస్తాడని అఖిల్ అక్కినేని అభిమానులు కూడా నమ్ముతున్నారు. ఇక ఈ సినిమాలో అఖిల్ కు తల్లిగా నిన్నటి తరం హీరోయిన్ ఆమని నటించనుంది. అఖిల్ తొలి సినిమా సిసింద్రీలో ఈమె నటించింది. దాంతో అప్పటి అనుభవాలను ఇప్పుడు గుర్తు చేసుకుంది ఈ సీనియర్ హీరోయిన్. కేవలం ఏడాది వయస్సు ఉన్నప్పుడే  అఖిల్ సిసింద్రీ సినిమాలో నటించాడు.

అంత చిన్న వయసులో ఎలా నటించాడా.. ఎలా సినిమా తీసారా అనిపిస్తుంది. అయితే అందులో అఖిల్ కు అమ్మగా నటించిన ఆమనీ ఒక ఇంటర్వ్యూలో అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అప్పట్లో అఖిల్ మూడ్ ను బట్టి సినిమా తీసేవాళ్లమని చెప్పుకొచ్చింది ఈ సీనియర్ హీరోయిన్. అఖిల్ హుషారుగా వున్నపుడు సినిమా తీసేవాళ్లమని.. కాస్త ఏడిస్తే ప్యాకప్ చెప్పే వాళ్లమని చెప్పారు ఆమని. ఆ సినిమా ఇప్పటికి తనకు చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చారు ఈమె. ఇన్నేళ్లకు మళ్లీ అఖిల్ కు తల్లిగా నటించబోతున్నానంటూ చెప్పింది ఆమని. బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమాలో అఖిల్ కు తల్లిగా నటిస్తుంది ఈమె. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. కచ్చితంగా ఈ సినిమాతో విజయం అందుకుంటానని ధీమాగా చెబుతున్నాడు అక్కినేని వారసుడు.

More Related Stories