English   

తల్లి వయసు టబుతో కుర్ర హీరో రొమాన్స్ 

Ishaan Khattar
2019-12-04 14:24:36

ఆమె వయసు 48.. ఆ కుర్రాడి వయసు 18.. ఆ ఇద్దరి మధ్యా అబ్బో చెప్పలేని ఏదో బంధం.. ఈ లైన్ లో ఒక సినిమా రాబోతోంది అది కూడా అందాల తార టబు వేశ్య పాత్రలో.  బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సోదరుడైన ఇషాన్ తనకు తల్లి వయసున్న టబుతో కలిసి ఈ సినిమా కోసం రొమాన్స్ చేయబోతుండడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. క్రియేటివ్ లేడీ డైరెక్టర్ మీరా నాయిర్ ఓ అద్భుతమైన కళాఖండాన్ని తీర్చిదిద్దుతున్నారు. 1940 బ్యాక్ డ్రాప్ లో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కథాంశాన్ని ఎంతో కళాత్మ కంగా తెరపై చూపించనున్నారు. ఈ సినిమా పేరు `ఏ సూటబుల్ బోయ్`. టైటిల్ కి తగ్గట్టే  తాజాగా  రివీల్ చేసిన పోస్టర్ లో టబు – ఇషాన్ మధ్య వ్యవహారం హాట్ గా ఉంది. కథ ఏంటంటే.. మాన్ కపూర్ (ఇషాన్ ఖత్తర్) మహేష్ కపూర్ (రామ్ కపూర్) అనే పేరున్న రాజకీయనాయకుడి కుమారుడు. ఎవరికీ బెదరడు. అడ్డొచ్చినవాళ్లని కొట్టిపడేస్తుంటాడు. అలాంటిది సయ్యదా బాయ్ (టబు) అనే వేశ్యను చూసి ప్రేమలో పడతాడు. ఆమె వేశ్య అయినప్పటికీ ఆమె అందానికి ముగ్దుడైపోతాడు. ఆ తర్వాత జరిగే సన్నివేశాలను ఈ సినిమాలో చూపనున్నారు. ఇది చింతామణి తరహా కథాంశమేనని అంటున్నారు. చూడాలి మరి ఇంకెంత రచ్చ జరుగుతుందో.

More Related Stories