English   

నాగబాబుతో ఆడుకున్న శ్రీ రెడ్డి.. ఆయన గురించి ఇంకొక్క మాట..

Sri reddy
2019-12-04 14:38:20

తెలుగు ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి పేరు వినిపిస్తే చాలు ఎవరికో మూడింది అని అర్థం చేసుకోవాలి. ఎవరిని ఎప్పుడు ఎలా టార్గెట్ చేస్తుందో ఎవరికీ అర్థం కాదు. లేడీ రామ్ గోపాల్ వర్మ మాదిరి ఎప్పుడు ఎవర్నో ఒకర్ని గిల్లుటూనే ఉంటుంది శ్రీ రెడ్డి. ఇక ఇప్పుడు కూడా ఇదే చేసింది. ప్రస్తుతం ఈమె టార్గెట్ నాగబాబు. ఒకవైపు డాక్టర్ ప్రియాంకా రెడ్డి అత్యాచారంపై ఏడుస్తూ మాట్లాడుతూనే మరోవైపు తనదైన స్టైల్ లో నాగబాబుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి. ఈ మధ్య జబర్దస్త్ కామెడీ షో నుంచి బయటికి వచ్చాడు మెగా బ్రదర్. 

అయితే బయటికి వచ్చిన తర్వాత ఆ షో గురించి కొన్ని నిజాలు చెప్పడం మొదలుపెట్టాడు.. తాను ఎందుకు జబర్దస్త్ కామెడీ షో మానేయాల్సి వచ్చింది.. అక్కడి నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అనే విషయంపై కొన్ని ప్రత్యేకమైన కారణాలు ప్రేక్షకులకు వివరిస్తున్నాడు. నాగబాబు ఈ విషయంపై శ్రీరెడ్డి చాలా సీరియస్ అయింది. ఏడేళ్ల పాటు అక్కడ ఉండి.. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి పెట్టిన తిండి తిని.. ఇప్పుడు ఆయన గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నావు నీకు అసలు సిగ్గు లేదా స్నేక్ బాబు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయింది శ్రీ రెడ్డి. 

ఇంకోసారి శ్యాంప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నీకు మర్యాద దక్కదు అంటూ వార్నింగ్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అసలు నీలాంటి వాళ్ళను జబర్దస్త్ కామెడీ షో లోకి తీసుకోవడమే ఆయన చేసిన పెద్ద తప్పు.. క్రేజ్ లేని నీకు ఈ కామెడీతోనే గుర్తింపు వచ్చింది అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఇప్పుడు షో గురించి.. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావ్ నీకు మనస్సాక్షి లేదు.. అంటూ మెగాబ్రదర్ పై మండి పడింది. మరి దీనికి నాగబాబు నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.

More Related Stories