English   

అల్లు అరవింద్ పై మండిపడిన మెగాస్టార్..

 Mammootty
2019-12-04 15:35:09

అవునా... ఇది ఎప్పుడు జరిగింది.. అయినా మెగాస్టార్ ఎందుకు అల్లు అరవింద్ మీద మండి పడతాడు.. వారిద్దరూ బాగా క్లోజ్ కదా అనుకుంటున్నారా. అయితే ఇక్కడ మెగాస్టార్ అంటే మన చిరంజీవి కాదు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. మన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం ఈయన. ఇన్నేళ్ల కెరీర్లో మలయాళం తప్ప ఇతర భాషలను పెద్దగా పట్టించుకోని మమ్ముట్టి.. తెలుగులో మాత్రం సూర్య పుత్రులు, స్వాతి కిరణం, యాత్ర వంటి చిత్రాల్లో నటించారు. 

ప్రస్తుతం ఆయన నటించిన మామాంగం సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. కేరళ చరిత్రలోని యుద్ధ వీరుల కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాని 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాడు దర్శకుడు ఎం పద్మకుమార్. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చాడు మమ్ముట్టి. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేసాడు. ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 స్వాతి కిరణం సినిమా విడుదలకు ముందు మమ్ముట్టి అనే మలయాళ హీరో తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా ఆయన సినిమాలు చూస్తారా అని అనుకున్నామని.. కానీ ఆ సినిమా మాత్రం ఎప్పుడూ మర్చిపోలేనంత గొప్పగా నటించారని చెప్పారు అల్లు అరవింద్. ఆ తర్వాత పదేళ్లు టైం తీసుకొని పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ పాత్ర కోసం మమ్ముట్టిని అడగడానికి ఫోన్ చేసినట్లు గుర్తు చేసుకున్నాడు అల్లు అరవింద్. దానికి మమ్ముట్టి.. ఇదే మాట చిరంజీవిని అడగగలరా..? అని ప్రశ్నించారని.. దానికి తాను అడగలేను అని సమాధానం చెప్పినట్లు తెలిపాడు అల్లు అరవింద్. దానికి వెంటనే మమ్ముట్టి మరి నన్ను ఎందుకు అడిగారని.. దాంతో వెంటనే ఫోన్ కట్ చేసినట్టు చెప్పాడు అల్లు అరవింద్. ఈ విషయాన్ని అల్లు అరవింద్ స్వయంగా గుర్తు చేసుకున్నారు. 

మమ్ముట్టి ఇలానే గతంలో దర్శకుడు దేవకట్టాపై కూడా సీరియస్ అయ్యారు. ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ పాత్ర కోసం ముందుగా మమ్ముట్టినే సంప్రదించారు. దానికి ఆయన దర్శకుడిపై మీద ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని దేవకట్టా పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. మొత్తానికి మలయాళ మెగాస్టార్ను విలన్ పాత్ర కోసం అడిగేసరికి ఆయనకు బాగానే మండిపోయింది అన్నమాట.

More Related Stories