English   

శ్రీకాంత్ అడ్డాలకు ఎన్ని కష్టాలొచ్చాయో పాపం.. రెమ్యూనరేషన్ లేకుండా..

 Srikanth Addala
2019-12-04 16:01:15

త‌న కెరీర్ ను సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టులా డిజైన్ చేసుకుందాం అనుకున్న శ్రీ‌కాంత్ అడ్డాల‌కు బ్ర‌హ్మోత్స‌వం వ‌చ్చి పెద్ద షాకే ఇచ్చింది. ఈ సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఆఫ‌ర్ కూడా రాలేదు. ఒకే ఒక్క సినిమా ఈయ‌న కెరీర్ ను ముంచేయ‌డం కాదు.. క‌నిపించ‌కుండా చేసింది. అదే బ్ర‌హ్మోత్స‌వం. ఈ సినిమాలో మంచి మ‌రీ ఎక్కువైపోయి డిజాస్ట‌ర్ అయిపోయింది. ఆ త‌ర్వాత క‌నిపించ‌డ‌మే మానేసాడు. ఆ మ‌ధ్య డిజే ఆడియో వేడుక‌లో త‌న సంస్థ‌లో ప‌ని చేసిన ద‌ర్శ‌కులంద‌ర్నీ ఒకే చోట చేర్చాడు దిల్ రాజు. అప్పుడు చూసిందే ఈ ద‌ర్శ‌కున్ని.. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట క‌న‌బ‌డ‌లేదు. బ్ర‌హ్మోత్స‌వం ఇచ్చిన షాక్ తో ఈయ‌న వైపు చూడ్డానికి కూడా నిర్మాత‌లు సాహ‌సించ‌డం లేదు. ఒక్క‌టి రెండు కాదు.. ఏకంగా 35 కోట్ల‌కు పైగా న‌ష్టాలు తీసుకురావ‌డంతో శ్రీ‌కాంత్ అడ్డాల‌పై న‌మ్మ‌కాల‌న్నీ పోయాయి. బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత మ‌నోడు ఏ సినిమాకు కూడా క‌మిట్ కాలేదు.

ఆ మ‌ధ్య మెగా కుటుంబంలో ఉన్నాడ‌ని.. అక్క‌డ అల్లు శిరీష్ తో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. గీతాఆర్ట్స్ లోనే సినిమా ఉంటుంద‌నుకున్నారు కానీ శిరీషే లేద‌ని చెప్ప‌డంతో ఆశ‌లు ఆవిరైపోయాయి. దిల్ రాజు బ్యాన‌ర్ లోనూ సినిమా కోసం చూసాడు శ్రీకాంత్ అడ్డాల‌. ఈయ‌న‌కు కొత్త బంగారు లోకం.. సీత‌మ్మ వాకిట్లో లాంటి సినిమాలు ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆ న‌మ్మ‌కంతోనే మంచి క‌థ రాసుకొని వెళ్తే రాజుగారు ఛాన్సిస్తార‌నుకున్నాడు ఈయ‌న‌. కానీ ఆ మంచి క‌థ కుద‌ర‌డం లేదు. అయితే ఇన్నాళ్లకు వెంకటేష్ హీరోగా తమిళ సినిమా అసురన్ ను తెలుగులో రీమేక్ చేసే అవకాశం అందుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమా కోసం కథ రాయడం మొదలు పెట్టాడు. అయితే దీని కోసం ఎలాంటి పారితోషికం తీసుకోకుండా పనిచేస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. విడుదలైన తర్వాత పారితోషకం ఇస్తామని నిర్మాతలు చెప్పినట్లు తెలుస్తోంది. అసురన్ లాంటి సినిమాకు శ్రీకాంత్ అడ్డాల సరైన దర్శకుడు కాదు అంటూ ఇండస్ట్రీలో ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వెంకటేష్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More Related Stories