English   

రాంగోపాల్ వర్మ బయోపిక్ సిద్ధం.. దర్శకుడు ఎవరో తెలుసా..

 Ram Gopal Varma biopic
2019-12-04 16:33:28

ఎప్పుడూ సంచలనాలను జేబులో పెట్టుకుని తిరిగే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ప్రపంచంలో ఈయనను మించిన కాంట్రవర్సీ డైరెక్టర్ మరొకరు ఉండరేమో. వివాదం వస్తే ఓకే.. లేకపోతే వెళ్లి మరి ఈయన సృష్టిస్తుంటారు. అదే వర్మ స్టైల్. ఎప్పుడూ ఎవరి బయోపిక్ తీద్దామా.. ఎవరి జీవితంలోకి తొంగి చూద్దామా అని ఆసక్తిగా చూస్తుంటారు రామ్ గోపాల్ వర్మ. కొన్నేళ్లుగా పూర్తిగా బయోపిక్ లకు సెటిల్ అయిపోయాడు వర్మ. ఇప్పుడు కూడా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ ఒకరకమైన బయోపిక్ తెరకెక్కిస్తున్నాడు ఆర్జీవి. 

ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా చేసుకొని ఒక పొలిటికల్ సెటైర్ తీస్తున్నాడు వర్మ. ఈ సినిమా నవంబర్ 29న విడుదల కావాల్సి ఉన్నా కూడా సెన్సార్ బోర్డు ఒప్పుకోకపోవడంతో గట్టి షాక్ తగిలింది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సమయంలోనే రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుతో వర్మ వివాదం పెట్టుకున్నాడు. ఇద్దరు ఒకరినొకరు తారస్థాయిలో తిట్టుకున్నారు కూడా. దాంతో అందరి బయోపిక్లు తీసే వర్మపై తాను బయోపిక్ తీస్తాను అంటూ జొన్నవిత్తుల అనౌన్స్ చేశాడు. 

అప్పుడు ఏదో కామెడీకి అన్నాడు అనుకున్నారు కానీ ఇప్పుడు చూస్తుంటే నిజంగానే వర్మ బయోపిక్ ఏర్పాట్లు భారీగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం మధ్యప్రదేశ్ నుంచి అచ్చంగా వర్మ మాది రేపు ఉండే ఒక నటుణ్ని జొన్నవిత్తుల వెతికి పట్టుకున్నారని తెలుస్తోంది. ఆయనకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి బయోపిక్ కోసం సిద్ధం చేస్తున్నాడు. దీనికి పప్పు వర్మ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. వీలైనంత త్వరగా ఈ బయోపిక్ తెరకెక్కించి తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు జొన్నవిత్తుల. మరి వర్మ బయోపిక్ ఎలా ఉండబోతుందో చూడాలి.

More Related Stories