English   

తెలుగు ఇండస్ట్రీలో వ్యభిచార దందా.. ఆఫర్ల పేరుతో అమ్మాయిలకు వల..

Tollywood prostitution racket
2019-12-04 17:24:12

సినిమా ఇండస్ట్రీలో మోసపోయినంత ఈజీగా మరెక్కడా మోసపోరేమో..? పాపం అవకాశం వస్తుందేమో అనే ఆశలో ఇక్కడ చాలా మంది అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా మోసపోతున్నారు. ఇదే అదునుగా చేసుకుని కొందరు తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే మరోటి జరిగిందని తెలుస్తుంది. ఈ రంగుల ప్రపంచాన్ని ఏలేద్దామని.. ఇక్కడికి వచ్చి వెలిగిపోవాలని.. ఎక్కడెక్కడి నుంచి ఈ కలల ప్రపంచంలోకి వస్తుంటారు అమ్మాయిలు. అలాంటి వాళ్లకు మాయ మాటలు చెప్పి.. అవకాశాలు ఇప్పిస్తామని మోసం చేసి వాళ్లను బలవంతంగా వ్యభిచార ముగ్గులోకి దించుతున్నాయి కొన్ని ముఠాలు. 

అందులో కొందరు టాలీవుడ్ సీనియర్ నటీమణులు కూడా ఉండటం శోచనీయం. ఇప్పటికీ అది జరుగుతుందని తెలుస్తుంది. ఆ మధ్య ఇద్దరు సీనియర్ సీరియల్ హీరోయిన్లు ఈ రాకెట్ లో పట్టుబడ్డారు. అయినా కూడా ఇప్పటికీ ఈ వ్యభిచార ముఠా ఆగడాలు అలాగే జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇండస్ట్రీ వాళ్లే కావడంతో అమ్మాయిలు కూడా వాళ్లను ఈజీగా నమ్మేస్తున్నారని.. అదే అదునుగా అమ్మాయిల జీవితాలతో వాళ్లు ఆడుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. 

ఫిల్మ్‌నగర్‌లోకి ఎన్నో కలలతో అడుగు పెడుతున్న వాళ్లను తమ మామ మాటలతో మోసం చేసి ఈ ఉచ్చులోకి దించుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వ్యభిచార ముఠా రాకెట్‌లో ఓ సీనియర్ నటి హస్తం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. హీరోయిన్లు, కారెక్టర్ ఆర్టిస్టులు అవుదామని కోటి కలలతో వచ్చిన అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి వారిని ఉచ్చు లోకి దించుతుందని.. ఆమెపై పోలీసుల నిఘా కూడా బాగానే ఉందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఒక్కసారి ఆమె ఉచ్చులో పడ్డాక పాపం ఎంతోమంది అమ్మాయిలు బయటికి రాలేక తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారనే చేదు నిజాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను షాక్ అయ్యేలా చేస్తున్నాయి. 

కామెడీ వేషాలతో పాటు ఓ సీనియర్ కమెడియన్ తో ఎక్కువగా నటించిన ఆమెకు ఈ మధ్య అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దాంతో ఐదేళ్లుగా ఈ దందా చేస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఆమె దగ్గర 10 మంది అందమైన అమ్మాయిలు ఉన్నారని.. పాపం అంతా 20 ఏళ్ల లోపు వారే అని వార్తలు వస్తున్నాయి. అందరికీ ఆఫర్లు ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్ రప్పించింది ఈ నటి. అయితే అందులో ఓ అమ్మాయి ఎందుకో ఆమెపై అనుమానం వచ్చి తండ్రికి కాల్ చేయడం అసలు విషయం బయటికి వచ్చింది. తన కూతురు మోసపోతుందని గ్రహించిన ఆ తండ్రి.. ఆ సీనియర్ నటి ఇంటికి వెళ్లి మరీ గొడవ చేసాడని.. అక్కడ సంచలన నిజాలు బయటపడ్డాయని తెలుస్తుంది. ఈ దందాను ఆ నటి ఐదేళ్ల నుంచి చేస్తుందని.. ఈ వ్యభిచార రొంపిలోకి ఒక్కసారి వెళ్లాక అందులో నుంచి ఎవ్వరూ బయట రావడం లేదని.. అంతగా ఆమె వలలో అమాయకపు అమ్మాయిలు పడిపోతున్నారని చేదు నిజాలు బయటికొస్తున్నాయి. మొత్తానికి మరి ఈ వ్యభిచార ముఠా గుట్టు ఎప్పుడు రట్టు అవుతుందో చూడాలిక.

More Related Stories