English   

పవన్ కళ్యాణ్ మీద ఇండస్ట్రీ పెద్దలు సీరియస్ అవుతున్నారా..

pk
2019-12-04 19:15:05

ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.. ఇన్నాళ్లు తెలుగు ఇండస్ట్రీలో ఉంటూ వరుస సినిమాలు చేసుకుంటూ పవర్ స్టార్ గా ప్రేక్షకులతో మన్ననలు అందుకున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలకు దగ్గరగా ఉన్నాడు. జనసేన పార్టీ పనులలో భాగంగా ఎప్పుడు కనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన గెలవాలని సినిమా ఇండస్ట్రీ కూడా కోరుకుంది. ఎప్పుడూ సపోర్ట్ గానే ఉంది. ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పనిలో కూడా ఇండస్ట్రీ చాలా సాఫ్ట్ కార్నర్ చూపించింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడు ఉన్నట్టుండి తెలుగు ఇండస్ట్రీ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. దిగజారిపోతుందని.. ఇక్కడ కొందరు హీరోలకు చదవడం రాయడం కూడా రాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఎవరిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశాడు అంటూ ఆయనపై మండిపడుతున్నారు..

ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియాలో భారీగానే ట్రోల్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు చదవడం రాయడం రాని పెద్ద హీరో మహేష్ బాబు ఒక్కడే. ఆ విషయం ఆయన కూడా కూడా ఒప్పుకున్నాడు. చెన్నైలో పుట్టి పెరగడం వల్ల తనకు తెలుగు చదవడం రాయడం రాదు అంటూ ఇదివరకే చెప్పాడు కూడా. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరినీ ఉద్దేశించి తెలుగు చదవడం రాయడం కూడా రాని వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు.. ఆ మాత్రం బాధ్యత కూడా లేదా అని పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహేష్ బాబు అభిమానులను బాగానే హర్ట్ చేసాయి. దానికితోడు కొందరు ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇలా టాలీవుడ్ ను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం ఏమాత్రం తమకు నచ్చలేదు అంటున్నారు. మరి ఈ విషయం ఎంత దూరం వెళుతుందో చూడాలి.

More Related Stories