English   

మరి అంత క్రియేటివిటీ వద్దురా బాబు.. నిర్మాతలపై సెటైర్లు..

movie
2019-12-04 19:40:37

ఒక సినిమా ఆడాలంటే బాగుండటంతో పాటు ప్రమోషన్ కూడా బాగుండాలి. అప్పుడే సినిమాలు ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతాయి. ఒకవైపు సీరియల్స్ మరోవైపు డిజిటల్ మీడియా.. థియేటర్ వరకు రావాలంటే మన సినిమాలో దమ్ము వుండాలి. అప్పుడే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కేవలం ప్రమోషన్ జిమ్మిక్కులు చేసినంత మాత్రాన జనాలు సినిమాలు చూస్తారు అనుకుంటే అంతకంటే వెర్రితనం మరొకటి ఉండదు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా నిర్మాతలు కొన్ని  విచిత్రమైన ప్రణాళికలు వేసి బయట జనాలతో విమర్శలు తిట్లు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రమోషన్ పేరు తో మరింత దిగజారిపోతున్నారు మన దర్శక నిర్మాతలు అని బయట బాగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఒక సినిమా విషయంలో విడుదల రోజు మార్నింగ్ షో ఉచితం అన్నారు. ఫ్రీగా వస్తే ఫినాయిలు కూడా తాగే జనాలకు మన సమాజంలో బాగానే ఉన్నారు కాబట్టి ఈ ఫ్రీ షో చూడటానికి ఎగబడ్డారు. కానీ మ్యాట్నీ షో నుంచి థియేటర్లో ఈగలు తోలు కోవడం తప్ప మరొక విషయం లేదు. పోనీ నువ్వు వేసిన ప్లాన్ బాగానే ఉంది ప్రమోషన్ వర్కవుట్ అయి సినిమాకు మంచి టాక్ వచ్చి నిలబడి ఉంటే అప్పుడు బాగుండేది.  కానీ  ఫ్రీ షో అనేసరికి మొదటి ఆట మాత్రం చూసి రెండో షో నుంచి ఎవరూ రాలేదు.

అయితే అసలు సినిమా రిలీజ్ అవుతుందని ఎవరికీ తెలియకుండా ఉన్నప్పుడు ఆ నిర్మాత వేసిన ప్లాన్ తో వస్తున్నట్లు కొంతమందికి తెలిసింది. అదీ కాస్తో కూస్తో బెటర్. కానీ ఆ ప్రమోషన్ను బాగా వాడుకొని ఉంటే  సినిమా బతికేది. కానీ సినిమాలో విషయం లేకుండా ఇలాంటి ఎన్ని ప్లాన్స్ వేసినా కూడా  జనాలు పట్టించుకోరు. ఇక ఇప్పుడు మథనం టీమ్ మరో కొత్త ఐడియాతో వస్తున్నారు. తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చెయ్యకుండా అమెరికాలో మాత్రమే విడుదల చేస్తున్నారు. కాసేపు నిజాలు మాట్లాడుకుంటే అమెరికాలో చిన్న సినిమాలను ఎవరూ పట్టించుకోరు. ఇంకా మాట్లాడితే స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ మధ్య అక్కడ కలెక్షన్లు రావడం లేదు. అలాంటిది మన సినిమా మన దగ్గర కాకుండా అమెరికాలో రిలీజ్ చేయడం వెనక ఎలాంటి ప్రమోషన్ దాగుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలా చిత్రవిచిత్రమైన ఐడియాలు వేసి ప్రమోషన్ పేరుతో ఏదేదో చేస్తూ తెలుగు సినిమా పరువు గంగలో కలిపెస్తున్నారు అంటూ కొందరు ఇండస్ట్రీ పెద్దలు బాహాటంగానే చిన్న సినిమాలపై ఫైర్ అవుతున్నారు. విషయం లేని సినిమాలు తీసి అనవసరంగా ఏదో పిచ్చి పనులు చేస్తున్నారు అంటూ వాళ్ళ పై మండిపడుతున్నారు.

More Related Stories