English   

రిలీజ్ డేట్స్ మార్చుకున్న చిరంజీవి, రాజమౌళి..

Chiranjeevi Rajamouli.jpg
2019-12-05 07:44:14

చిరంజీవి, కొరటాల శివ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా గురించి ఆసక్తిగా వేచి చూస్తున్నారు అభిమానులు కూడా. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ ఇదే అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి.

దేవాలయం మాఫియా నేఫథ్యంలో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలుస్తుంది. అందుకే సింహాచలం గుడిని పోలిన భారీ సెట్ నిర్మిస్తున్నారు.. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నాడు కొరటాల శివ. చాల ఏళ్ల క్రితం సింహాచలం ఆలయ ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ సంఘటనకు ఆధారంగా ఈ సినిమా కథ అల్లుకున్నట్లు తెలుస్తుంది. దేవాలయాలలో జరుగుతున్న అవినీతి మాఫియా లాంటి విషయాలను హైలెట్ చేస్తూ కొరటాల శివ ఈ కథను రాసినట్లు ప్రచారం జరుగుతుంది.

ఇందులో చిరంజీవి దేవాదాయ శాఖ అధికారిగా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ పాత్ర కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు మెగాస్టార్. దేవున్ని పెద్దగా నమ్మని కొరటాల.. ఇప్పుడు ఇలాంటి కథ తీసుకురావడం నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ శాఖ అధికారిగా నటిస్తున్నాడని తెలుస్తుంది. స్టాలిన్ సినిమా తర్వాత 12 ఏళ్లు గ్యాప్ తీసుకుని త్రిషతో మరోసారి రొమాన్స్ చేయబోతున్నాడు మెగాస్టార్. ఇక ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. ఇప్పుడు దీనికి సమాధానం వచ్చేసింది.

జులై 30న ఈ చిత్రం విడుదల కానుందని తెలుస్తోంది. ఆరోజు రాజమౌళి ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి సినిమా వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీ వర్గాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి తన సినిమాని జూలై 30న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు రాజమౌళి సినిమా గాంధీ జయంతి కారణంగా అక్టోబర్ 2న విడుదల కానుందని తెలుస్తోంది. ఈ తేదీతో చిరంజీవికి ప్రత్యేక అనుబంధం ఉంది. మెగాస్టార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నటించిన సైరా నరసింహారెడ్డి కూడా అక్టోబర్ 2 న విడుదలైంది. 

2020 అక్టోబర్ 2న రాజమౌళి తన సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు. మొత్తానికి తమ సినిమా రిలీజ్ డేట్స్ మార్చుకొని అభిమానులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మెగాస్టార్, దర్శకధీరుడు.

More Related Stories