English   

ప్రభాస్ బాలీవుడ్ వెళ్తున్నాడా.. విలన్ వేషాలు వేస్తాడా..

Prabhas
2019-12-05 12:11:48

ప్రభాస్ అంటే ఇన్నాళ్లు తెలుగు హీరోగానే ప్రేక్షకులకు తెలుసు. కాని బాహుబలి తర్వాత ఆయన పాన్ ఇండియా పాపులారిటీ ఎంజాయ్ చేస్తున్నాడు. రాజమౌళి ఎఫెక్ట్ తో బాహుబలి సినిమా భారీ కలెక్షన్లు సాధించింది అంటే ఏమో అనుకోవచ్చు కానీ మొన్న సాహో సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న తర్వాత కూడా భారీ వసూళ్లు సాధించింది. అక్కడ 150 కోట్లు మార్క్ అందుకుంది ఈ చిత్రం. దీన్నిబట్టి ప్రభాస్ కు నేషనల్ వైడ్ గా పాపులారిటీ వచ్చింది అనే విషయం అర్థమైపోతుంది. వాళ్లు అతన్ని ఓన్ చేసుకున్నారు అని కూడా ఈజీగానే తెలిసిపోతుంది. కాస్త ప్లాన్ చేసుకుంటే ప్రభాస్ బాలీవుడ్లో జెండా పాతేయొచ్చు అంటున్నారు విశ్లేషకులు. 

ముఖ్యంగా సాహో సినిమాకు ఉత్తరాది రాష్ట్రాల్లో వస్తున్న వసూళ్లు చూసి అక్కడి ట్రేడ్ పండితులు కూడా షాక్ అవుతున్నారు. ఒక తెలుగు హీరోకు ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఉండటాన్ని వాళ్ళు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి సాహో సినిమాకు తొలి రోజు వచ్చిన టాక్ చూసి బాలీవుడ్ లో దారుణంగా డిజాస్టర్ అవుతుందని లెక్కలు వేసుకున్నారు అందరూ. బాహుబలి తో వచ్చిన ఇమేజ్ ను ప్రభాస్ అనవసరంగా పోగొట్టుకున్నాడు అంటూ విమర్శించారు. కానీ ఈ సినిమా నెగిటివ్ టాక్ తట్టుకొని 160 కోట్లకు పైగా వసూలు చేసింది బాలీవుడ్లో సూపర్ స్టార్స్ కు తానేమీ తక్కువ కాదని నిరూపించాడు ప్రభాస్. దాంతో అసలు చిక్కులు మొదలయ్యాయి. బాలీవుడ్ లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థమైపోయింది. 

సాహో సినిమా అనుకున్న విధంగా సక్సెస్ కాదేమో కానీ ఈ సినిమాతో మాత్రం కచ్చితంగా ప్రభాస్ ప్రభావం హిందీ ఇండస్ట్రీపై భారీగానే పడిందని తెలిసిపోతుంది. దాంతో ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్ కి పరిచయం చేయాలని అక్కడి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆదిత్యా చోప్రా తాను నిర్మించబోయే ధూమ్-4 సినిమాలో ప్రభాస్ ను విలన్ గా నటించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయనకు 100 కోట్లకి పైగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు పోషించిన పాత్రలో ప్రభాస్ ను అడుగుతున్నాడు ఆదిత్యా చోప్రా. మరి ఈ క్యారెక్టర్ కు ప్రభాస్ ఓకే చెబుతాడో లేదా అనేది చూడాలి.

More Related Stories