కంటిచూపుతో చంపేస్తున్న కాజల్ అగర్వాల్..

సాధారణంగా సినిమాల్లో బాలకృష్ణ చెబుతుంటాడు కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా అని ఇప్పుడు బాలయ్య చెప్పిన దాన్ని నిజం చేసి చూపిస్తుంది కాజల్ అగర్వాల్ అసలే బయట చలి చంపేస్తోంది అలాంటి సమయంలో చందమామ గిలి పుట్టిస్తోంది చాలా రోజుల తర్వాత మళ్లీ రెచ్చిపోయింది ఈ భామ. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో రెండు సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలేవీ చేయడం లేదు కాజల్ అగర్వాల్. కానీ తమిళం హిందీలో మాత్రం వరుస సినిమాలు చేస్తూనే ఉంది. తమిళనాట భారతీయుడు 2 సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చింది చందమామ. ఇక హిందీలో కూడా మూడు సినిమాలు చేస్తుంది. అయితే అన్ని అక్కడ చిన్న సినిమాలు చేయడం గమనార్హం. వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ఫోటోషూట్ లు కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. చిట్టిపొట్టి డ్రస్సుల్లో కాక పుట్టించింది కాజల్. ఆ మధ్య బాలీవుడ్ మోజులో పడి కాస్త డోస్ పెంచేసిన చందమామ.. ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఇదే కంటిన్యూ చేస్తుంది. ఆ మధ్య కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యేలో బాగానే అందాలు ఆరబోసింది ముద్దుగుమ్మ. సినిమాలోనే కాదు బయట కూడా ఇలాగే హద్దులు చెరిపేస్తూ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ మధ్యే ఫోటోషూట్ లలో కూడా దూకుడు చూపిస్తుంది కాజల్. ఒక్కో ఫోటో షూట్ కు లక్షల్లో వసూలు చేస్తోంది కాజల్. దాంతో అటు సినిమాలు ఇటు ఫోటో షూట్లు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్లో ముందుకు వెళ్లిపోతుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి ఈమె అందాల ఆరబోత చూస్తుంటే మరో రెండు మూడేళ్ల పాటు ఇండస్ట్రీలోనే హీరోయిన్ గా ఉండాలని ఫిక్సైపోయింది.