నేను ఇండస్ట్రీకి వచ్చింది సెక్స్ కోసం కాదంటున్న బాలయ్య హీరోయిన్..

సినిమా అంటేనే సిగ్గు లేకుండా నటించడం అంటారు. అందుకే కొందరు హీరోయిన్లు అయితే అసలు సిగ్గు అనే పదాన్ని పూర్తిగా తమ దరికి కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అందులో రాధికా ఆప్టే అయితే ముందుంటుంది. ఈ భామ ఏ క్షణంలో ఏం సంచలనం సృష్టిస్తుందో చెప్పడం కష్టంగా మారుతుంది. మొన్నటికి మొన్న తనకు అందరికీ కావాల్సింది డబ్బే.. కారెక్టర్ కాదు అని సంచలనం సృష్టించింది ఈ భామ. తన వరకు డబ్బులే కావాలని ఓపెన్ గానే చెప్పేసింది ఈ భామ. డబ్బు ఇస్తే ఎలాంటి పాత్రలో అయినా నటిస్తానని సంచలన వ్యాఖ్యలు చేస్తుంది రాధికా.
ఇక ఇప్పుడు తన న్యూడ్ వీడియోల గురించి అసలేమాత్రం మొహమాటం లేకుండా కొన్ని విషయాలు చెప్పింది ఈ భామ. ఆ మధ్య పార్చ్డ్ తో పాటు ఓ షార్ట్ ఫిల్మ్ కోసం న్యూడ్ గా నటించింది రాధిక. ఈ వీడియోస్ విడుదలకు ముందే లీక్ అయ్యాయి. వీటి గురించి చాలా ఓపెన్ గా చెప్పింది రాధిక. తన న్యూడ్ వీడియోస్ గురించి ముందుగా చెప్పింది తన అమ్మే అని.. ఆ తర్వాత తన డ్రైవర్ కూడా న్యూడ్ వీడియోస్ చూసాడని పచ్చిగా మాట్లాడేసింది ఈ భామ. ఇలా మాట్లాడిన తర్వాత ఇంక మాట్లాడ్డానికి ఏం ఉంది..? అంతేకాదు క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువగా మాట్లాడింది ఈ భామే.
తెలుగులో తనకు స్టార్ హీరో నుంచి కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ కష్టాలు ఎదురయ్యాయని.. తను పడుకోడానికి ఇష్టపడలేదని షూటింగ్ లో నరకం చూపించారని.. తెలుగులో అసలు హీరోయిన్లకు విలువే ఉండదని ఆ మధ్య కాంట్రవర్సీ కమెంట్స్ చేసింది రాధిక. తెలుగులో ఈమె ధోనీ.. రక్తచరిత్ర.. లెజెండ్.. లయన్ లాంటి సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు న్యూడ్ వీడియోస్ పై కమెంట్స్ చేసింది. తాను కొన్ని సినిమాల్లో నగ్నంగా నటించిన కారణాన కొందరు దర్శకులు వచ్చి నేరుగా సెక్స్ కథలు చెబుతున్నారని.. ఇదేమిటని అడిగితే మీరు ఇంతకు ముందు నగ్నంగా నటించారు కదా అందుకే ఇలాంటి కథలు తీసుకొస్తున్నాం అని సమాధానం చెబుతున్నట్లు తెలిపింది రాధిక ఆప్టే.
ఈ మధ్య ఒక దర్శకుడు చెప్పిన కథలో మొత్తం సెక్స్ సీన్స్ తప్ప కథ లేదు అని చెబుతోంది రాధిక. తాను ఇండస్ట్రీకి వచ్చింది సెక్స్ సన్నివేశాల్లో నటించడానికి కాదు.. నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి అంటుంది. కథ డిమాండ్ చేసినప్పుడు అలా నటించడానికి అభ్యంతరం లేదు.. కానీ కేవలం అలా నటించడానికి మాత్రమే ఇండస్ట్రీ కి రాలేదు అంటోంది ఈ ముద్దుగుమ్మ.