English   

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. జాన్ షూటింగ్ మొదలు..

 Prabhas
2019-12-05 17:23:54

సాహో సినిమా తర్వాత ఉన్నట్టుండి ప్రభాస్ ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఆ సినిమా తెలుగులో అనుకున్న విజయం సాధించలేదు. కానీ హిందీలో మాత్రం మంచి విజయం సాధించింది. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సాహో లేకపోవడంతో తన తర్వాత సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్.

 ప్రస్తుతం ఈయన యువి క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ పై జిల్  మూవీ ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో జాన్ సినిమాలో నటిస్తున్నాడు. 1970ల కాలం నాటి యూరోప్ లో జరిగిన లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ యూరోప్ లో జరుపుకున్న జాన్ చిత్ర తదుపరి షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జనవరి లో ప్రారంభం కానుంది. నిజానికి సాహో ఫలితం చూసిన తర్వాత రాధా కృష్ణ కుమార్ సినిమా లో కొన్ని మార్పులు చేయాల్సిందిగా ప్రభాస్ సూచించినట్లు తెలుస్తోంది. 

అందుకే నవంబర్ నుంచి జరగాల్సిన షెడ్యూల్ జనవరి కి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా పూజ హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు UV క్రియేషన్స్. తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ ఆస్ట్రాలజర్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఆధ్వర్యంలో యూరోప్ బ్యాక్ డ్రాప్ లో పలు భారీ సెట్స్ హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. #PRABHAS20 తర్వాత షెడ్యూల్ జనవరిలో మొదలు కానుందని అందులో తాను కూడా పాల్గొంటానని.. జాన్ సినిమా పూర్తి స్థాయి ప్రేమకథగా తెరకెక్కుతుందని తెలిపింది పూజ హెగ్డే. ప్రస్తుతం అల వైకుంఠపురంలో అఖిల్ సినిమాలతో బిజీగా ఉంది ఈమె.

More Related Stories