English   

స్టార్ హీరోలపై సంచలన ఆరోపణలు చేసిన సోనాక్షి సిన్హా..

sonashi
2019-12-06 04:53:40

బాలీవుడ్ ప్రేక్షకులకు సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ ముద్దుగుమ్మ గురించి బాగానే తెలుసు. సౌత్ ఇండస్ట్రీ లో రజనీకాంత్ హీరోగా వచ్చిన లింగ సినిమాలో నటించింది సోనాక్షి సిన్హా. దానికి తోడు సల్మాన్ ఖాన్ సినిమాలలో ఎక్కువగా కనిపించింది కాబట్టి సౌత్ లో కూడా బాగానే ఫేమస్. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 50 ఏళ్లు దాటిన తర్వాత ఇరవై ఏళ్ల హీరోయిన్లతో రొమాన్స్ చేయడం అంటే చాలా దరిద్రంగా ఉంటుంది అంటూ ఓ రేంజిలో విరుచుకుపడింది సోనాక్షి సిన్హా. ఒకవేళ తనకు 55 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత 20 ఏళ్ల ఏళ్ల హీరోతో రొమాన్స్ చేయమంటే అస్సలు చేయను అని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. సోనాక్షి సిన్హా చేసిన కామెంట్స్ ఇప్పుడు హీరోలకు సూటిగా తగిలాయి. ఎందుకంటే ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా చాలాచోట్ల సీనియర్ హీరోలందరికీ 50 ఏళ్ళు దాటాయి. కొందరైతే 60లో కూడా ఉన్నారు. అలాంటి హీరోలంతా హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూనే ఉన్నారు.

వాళ్లందరికీ కలిపి సోనాక్షి సిన్హా ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతెందుకు ఇప్పుడు ఆమె నటించిన దబాంగ్ 3 సినిమా హీరో  సల్మాన్ ఖాన్ కూడా 50 ప్లస్. ఈయన సంగతి పక్కన పెడితే యాభై దాటిన చీరలు కూడా ఇప్పటికీ హీరోయిన్లతో లిప్ లాక్ సీన్లతో పాటు రొమాంటిక్ సన్నివేశాలు కూడా చేస్తున్నారు. వీళ్లందరినీ ఉద్దేశించి ఇప్పుడు సోనాక్షి సిన్హా ఘాటు వ్యాఖ్యలు చేసింది. యాభై ఐదేళ్లు వచ్చాకా సినిమాల్లో నటించే అవకాశం ఉంటే, అప్పుడు ఇరవై రెండేళ్ల కుర్రాళ్లతో తెరపై రొమాంటిక్ సీన్లలో నటించనని వ్యంగ్యంగా చెప్పింది సోనాక్షి. అంటే ఇప్పుడు యాభై దాటిన  హీరోలంతా 20 లో ఉన్న హీరోయిన్ లతో ఆడిపాడుతున్నారు అంటూ సోనాక్షి సిన్హా ఇన్ డైరెక్టుగా చెప్పింది. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. మరి వీటిపై హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

More Related Stories