English   

సంచలన సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న దగ్గుబాటి అభిరామ్..

abhi
2019-12-06 05:05:32

డాక్ట‌ర్ కొడుకు డాక్ట‌ర్ అవుతున్నాడో లేదో తెలియ‌దు కానీ యాక్ట‌ర్ కొడుకు మాత్రం క‌చ్చితంగా యాక్ట‌ర్ అవుతున్నాడు. అందుకే ఇండ‌స్ట్రీ అంతా వార‌సుల‌తో నిండిపోతుంది. ఇప్ప‌టికే 70 శాతం వాళ్లే ఉన్నారు. ఇప్పుడు మ‌రో వార‌సుడు కూడా ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు. దగ్గుపాటి ఫ్యామిలీ నుండి ఇప్ప‌టికే వెంక‌టేశ్.. రానా హీరోలుగా స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో హీరో రాబోతున్నాడు. సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్ నటుడిగా పరిచయం కాబోతున్నాడు. అదేంటి నటుడిగా అంటున్నారు హీరోగా కాదా అనుకుంటున్నారా ఈయన తొలి సినిమా హీరోగా చేయడం లేదు  ఆ మధ్య రాజు మహారాజు సినిమా తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు భాను శంక‌ర్ సినిమాతో ఈ వారసుడిని పరిచయం చేయాలనుకున్నాడు  సురేష్ బాబు.  కానీ అనుకోకుండా ఈ సినిమా ఆగిపోయింది. దాంతో ఇప్పుడు  బాబాయ్ వెంకటేష్ హీరోగా నటిస్తున్న అసురన్ సినిమా రీమేక్ తో దగ్గుబాటి అభిరామ్ ఇండస్ట్రీకి వస్తున్నాడని తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో వెంకటేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

తండ్రి కొడుకులుగా నటించబోతున్నాడు వెంకటేష్. అయితే ఇందులో మరో పాత్ర కూడా ఉంటుంది. ఆ క్యారెక్టర్ కోసం దగ్గుబాటి అభిరామ్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరో చిన్న కొడుకు పాత్ర అది. కథకు చాలా కీలకమైన ఈ పాత్రలో దగ్గుబాటి అభిరామ్ ఉంటే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అయితే అంత బరువైన పాత్రను అభిరామ్ చేయగలుగుతాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కాకపోతే వెంకటేష్ నటిస్తున్న సినిమా కాబట్టి అభిరామ్ పరిచయం అయితే ఆ కాంబినేషన్ బాగుంటుందని సురేష్ బాబు కూడా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయిమ్ ఏదేమైనా 2020లో దగ్గుబాటి అభిరామ్ ను స్క్రీన్ పై చూడటం మాత్రం ఖాయం. మరి అన్న రానా దగ్గుబాటి మాదిరే అభిరామ్ కూడా అద్భుతాలు చేస్తాడో లేదో చూడాలి.

More Related Stories