English   

వర్మ సంచలన నిర్ణయం... నేరుగా ఆన్ లైన్ లో రిలీజ్...

Ram Gopal Varma.jpg
2019-12-06 07:18:12

రాంగోపాల్ వర్మ ఏ సినిమా తెరకెక్కించిన కూడా వివాదాలు లేకుండా విడుదల కాదు. ఇప్పుడు ఆయన తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు కూడా ఇలాంటి కష్టాలు వస్తున్నాయి. సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి దానికి సర్టిఫికెట్ ఇవ్వలేమని చేతులెత్తేశారు.

సినిమాలో ఉన్న సన్నివేశాల్లో ఏకంగా 80 శాతం తొలగిస్తే కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేము అంటూ వాళ్ళు చెప్పేసరికి రాంగోపాల్ వర్మ షాక్ అయ్యాడు. నవంబర్ 29న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ రాలేదు. అసలు ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ లేదు. దాంతో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. దానికితోడు ఈ సినిమాపై ఇప్పటికే కె ఏ పాల్ కేస్ వేశాడు. తన పాత్రను అసభ్యకరంగా చూపించడంతో కోర్టును ఆశ్రయించాడు. 

ఆంధ్ర ప్రదేశ్ లో మరో వ్యక్తి కూడా ఈ సినిమా కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉంది అంటూ  హైకోర్టులో పిటిషన్ వేశాడు. కోర్టు ఈ పిటిషన్ ను కూడా తీసుకుంది. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేఏ పాల్, నారా లోకేష్ లాంటి వాళ్ల పాత్రల్ని ఈ సినిమాలో ఎంత ఎగతాళి చేసి విమర్శించి చూపించారో ప్రోమోలు చూస్తే అర్ధమవుతోంది. అందుకే వాళ్ల వాళ్ల అభిమానులతో పాటు సెన్సార్ సభ్యులు కూడా కమ్మ రాజ్యంలో సినిమాపై కన్నెర్ర చేశారు.

ఇందులో చాలావరకు సన్నివేశాలు తొలగిస్తే కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేము అంటూ వాళ్ళు బేషరతుగా చెప్పేశారు. దాంతో రివైజింగ్ కమిటీకి వెళ్ళాడు వర్మ. అక్కడ కూడా ఆయనకు ఫలితం వ్యతిరేకంగా వస్తే ఈ సినిమాను నేరుగా ఆన్లైన్లో విడుదల చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలా చేస్తే తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని ఫీల్ అవుతున్నాడు వర్మ. థియేటర్లో విడుదల కాకపోయినా కూడా తాను తీసిన మొత్తం సినిమా ఆన్ లైన్ లో విడుదల చేసి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు ఆర్జీవి.

ఆన్లైన్ లో విడుదల చేసుకోవడానికి ఎలాంటి సెన్సార్ అవసరం లేదు. దాంతో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు రాంగోపాల్ వర్మ. కానీ నేరుగా విడుదల చేస్తే ఆయనకు కొన్ని నష్టాలు తప్పవు. అలా అని సెన్సార్ సభ్యులు చెప్పినట్లు 80% సినిమా కట్ చేసి విడుదల చేస్తే అందులో జీవం ఉండదు. దాంతో వర్మ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

More Related Stories