English   

డిస్కో రాజా టీజర్.. రవితేజ ఫ్రీక్ ఔట్ టీజర్..

Disco Raja
2019-12-06 16:37:40

వరుస పరాజయాలతో ఉన్న రవితేజ డిస్కో రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి సినిమాలు తెరకెక్కించిన వీఐ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కాస్త ప్రయోగాత్మక కథను వినోదాత్మకంగా చెప్పే ప్రతయ్నం చేస్తున్నాడు ఈయన. రవితేజ ఇమేజ్ కి తగ్గట్లు బ్యాలెన్స్ చేస్తూ డిస్కో రాజా సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఆనంద్. 

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తయింది. జనవరి 24న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.. తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నాడు మాస్ రాజా. ఆర్ఎక్స్ 100 సినిమాలో ముద్దులతో రెచ్చిపోయిన పాయల్ రాజ్ పుత్.. తాన్యా హోప్.. ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ న‌భా న‌టేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పుడు విడుదలైన టీజర్ కూడా ఆసక్తికరంగానే ఉంది. కథ చెప్పకుండానే ఇది పూర్తిగా ప్రయోగాత్మక చిత్రమని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు విఐ ఆనంద్. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఇది వస్తుంది. టీజర్ విజువల్స్ కూడా అదిరిపోయాయి. చివర్లో ఫ్రీక్ ఔట్ అంటూ రవితేజ చేసిన ఛిల్ చూస్తుంటే సినిమాపై క్లారిటీ వచ్చేస్తుంది అభిమానులకు. ఈ చిత్రంతో కచ్చితంగా ఫామ్ లోకి వ‌స్తానంటూ ధీమాగా చెబుతున్నారు మాస్ రాజా. చూస్తుంటే ఆయన నమ్మకం కూడా నిలబడేలాగే కనిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమాతో రవితేజ హిట్ కొడతాడని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. రామ్ తల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి మాయ చేయబోతున్నాడు అనేది చూడాలి.

More Related Stories