English   

జబర్దస్త్ లో నాగబాబుపై పంచులు వేసిన హైపర్ ఆది, చలాకి చంటి..

nag
2019-12-07 06:48:41

గత రెండు వారాలుగా జబర్దస్త్ కామెడీ షో లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నాగబాబు ఈటీవీ తెలుగు వదిలిపెట్టి జీ తెలుగులోకి వెళ్లడం సంచలనంగా మారింది. ఆయన వెళ్లిన తర్వాత కూడా అక్కడ కొన్ని కామెంట్స్ చేస్తూ యూట్యూబ్ వీడియోలు చేయడం జబర్దస్త్ అభిమానులకు అస్సలు నచ్చడంలేదు. ఆయనతో పాటు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కూడా రావాలి అనుకున్నారని కానీ మల్లెమాల ప్రొడక్షన్స్ అగ్రిమెంట్ పేరుతో వాళ్లను అక్కడే బంధించి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు మెగా బ్రదర్. అయితే ఇప్పుడు తాజా ఎపిసోడ్ లో మాజీ జడ్జి నాగబాబుపై అదిరిపోయే పంచ్ వేసాడు హైపర్ ఆది. తన స్కిట్ లో భాగంగా కంటెస్టెంట్ లతో డైలాగులు చెప్పించిన మరి నాగబాబు పై సెటైర్లు వేయించాడు. అరేయ్ మనం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలిరా అంటే వెంటనే హైపర్ ఆది అదిరిపోయే సెటైర్ వేసాడు.

ఏడేళ్లుగా కలిసిన వారి విడిపోతున్నారు మూడేళ్లది బొక్క.. మన రిలేషన్ ఎంత అంటూ అదిరిపోయే పంచ్ విసిరాడు. ఇక చలాకి చంటి కూడా తన స్థితిలో నాగబాబు పై అదిరిపోయే సెటైర్లు వేశాడు. ఇక్కడ వేరే రాజు ఉండాలి కదా అంటూ ఒక కంటెస్టెంట్ అడిగితే ఆయనకు ఇక్కడ భోజన వసతులు బాగోలేవని వేరే రాజ్యానికి వెళ్ళిపోయాడు.. వెళుతూ వెళుతూ మాకు ఈ రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళాడు అంటూ నాగబాబుపై సెటైర్ వేశారు. ఆయన ఉన్నప్పుడు ఆయన ముందు భజన చేసిన జబర్దస్త్ కమెడియన్స్ ఆయన వెళ్లిన తర్వాత నాగబాబు పైనే పంచులు వేస్తున్నారు. ఏదేమైనా కూడా నాగబాబు వెళ్ళిన తర్వాత కూడా జబర్దస్త్ కామెడీ షో రేటింగ్ అనేది అలాగే మెయింటైన్ కావడంతో మల్లెమాల ప్రొడక్షన్స్ హ్యాపీగా ఉంది.

More Related Stories