English   

అత్యాచారాన్ని ఎంజాయ్ చేయమంటున్న అమితాబ్ బచ్చన్..

amitab
2019-12-07 06:58:58

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం దిశ సంఘటన సంచలనం సృష్టిస్తుంది. గత పది రోజులుగా వేరే టాపిక్ ఏది నడవడం లేదు. తాజాగా ఆ దారుణం చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో వేడి మరింత రాజుకుంది. దిశకు న్యాయం జరిగింది అంటూ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి సమయంలో అమితాబ్ బచ్చన్ కు మాత్రం లేనిపోని తలనొప్పులు వస్తున్నాయి. ఈయన ఎప్పుడు 30 ఏళ్ల కింద చేసిన ఒక కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. 1990లో విడుదలైన `మూవీ` అనే మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ మీద ఓ వార్తను పబ్లిష్ చేశారు. `అత్యాచారం తప్పదనప్పుడు.. వెనక్కి పడుకొని దాన్ని ఎంజాయ్‌ చేయటమే` అంటూ అమితాబ్‌ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆయన్ను ఇబ్బందులు పాలు చేసేలా కనిపిస్తున్నాయి.

ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నంత మీడియా లేకపోవడంతో అమితాబ్ చాలా పెద్ద కాంట్రవర్సీ నుంచి అప్పుడు బయటపడ్డారు. కానీ అదే కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా దిశ ఘటన తరువాత అమితాబ్‌ వ్యాఖ్యలను తెర మీదకు తీసుకువచ్చిన కొంతమంది నెటిజెన్లు.. బాలీవుడ్ సూపర్‌ స్టార్లే ఇలా మాట్లాడుతుంటే ఇక రక్షణ ఎక్కడ ఉంటుంది అని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఇప్పటి ఘటనపై అమితాబ్ నోరు తెరవలేదు అయినా కూడా ఎప్పుడో 30 ఏళ్ల కింద చేసిన కామెంట్స్ అన్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి.  ఏదేమైనా కూడా  అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్  ఎప్పుడైనా నోరు జారితే  తిప్పలు తప్పవని మరోసారి రుజువైంది.

More Related Stories