English   

బాలకృష్ణ సినిమాలో దిశ ఎపిసోడ్ ఉండబోతుందా..

Balakrishna disha
2019-12-07 11:29:52

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలను బట్టి చూస్తే ఇదే తెలుస్తుంది. బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో బోయపాటి శ్రీను సినిమాపై దృష్టి పెట్టాడు బాలయ్య. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 20 కేజీలకు పైగా బరువు తగ్గారు బాలకృష్ణ. ఇందులో ఆయన గెటప్ చూసి అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. 

ఇదిలా ఉంటే మరోసారి బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో చూపించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎపిసోడ్ ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. అచ్చంగా అదే కాకపోయినా ఆ సంఘటన గుర్తొచ్చేలా సినిమాలో బోయపాటి ఒక ఎమోషనల్ సీన్ డిజైన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే గతంలో సింహా సినిమాలో యాసిడ్ దాడికి సంబంధించిన సన్నివేశం ఒకటి పెట్టాడు బోయపాటి శ్రీను. అప్పట్లో స్వప్నికపై యాసిడ్ దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అది జరిగిన ఏడాదికి సింహా సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సీన్ కావాలనే సినిమాలో పెట్టాడు. ఇక ఆ తర్వాత లెజెండ్ సినిమాలో కూడా అమ్మాయిల ఆత్మాభిమానానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు రాసాడు బోయపాటి. 

ఇక ఇప్పుడు కూడా బాలయ్యతో తెరకెక్కిన ఈ సినిమాలో దిశకు సంబంధించిన ఒక ఎపిసోడ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే బాలయ్య సినిమాలో ఎపిసోడ్ ఉంటే ఖచ్చితంగా అది ఒక రేంజ్ లో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. దానికి తోడు బాలయ్య హీరో కావడంతో ఇక ఊహించుకోవలసిన అవసరం లేదు. జనవరిలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమా విడుదల కానుంది. మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని 50 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

More Related Stories