రంగస్థలం బ్యూటీ అందాలన్నీ అడవి కాచిన వెన్నెలేనా..

తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల హీరోయిన్లుగా వెలిగిపోవడం అరుదు. ఒకప్పుడు జయసుధ, జయప్రద కాలంతోనే అది ఆగిపోయింది. ఆ తర్వాత విజయశాంతి లాంటి ఎవరో ఒక్కరు ఇద్దరూ తప్ప తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో చక్రం తిప్పింది లేదు. అంజలి, ఈషా రెబ్బా లాంటి హీరోయిన్లు కూడా తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సమయంలో పూజిత పొన్నాడ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తుంది. రంగస్థలం సినిమాలో ఆది ప్రియురాలిగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత దర్శకుడు, వేర్ ఈజ్ వెంకటలక్ష్మి లాంటి సినిమాల్లో నటించింది. పూజిత షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ పెద్ద సినిమాల వైపు అడిగేసింది. తెలుగమ్మాయే అయినా కూడా అందాలు ఆరబోయడంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు పూజిత.
దాంతో దర్శక నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మ వైపు బాగానే చూస్తున్నారు. ఈ మధ్య బాగానే అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యే హవీష్ హీరోగా వచ్చిన సెవెన్ సినిమాలో నటించింది పూజిత. అయితే ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో ఈ భామ కెరీర్ ఎటూ కాకుండా పోతుంది. అయినా కూడా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఇప్పుడు అవకాశాలు బాగానే వస్తున్నాయని.. ఒకప్పటిలా మన దర్శక నిర్మాతలు పరభాషా హీరోయిన్ల వైపు చూడటం లేదని.. నాకు తెలుగు అమ్మాయి కావాలి అని అడిగే రోజులు వచ్చేశాయని చెబుతోంది పూజిత పొన్నాడ. దాంతో తన లాంటి తెలుగు అమ్మాయిలకు ఇంకా చాలా అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరి నిజంగానే తెలుగు అమ్మాయిలకు తెలుగు ఇండస్ట్రీలో మంచి రోజులు వచ్చాయో లేదో మరి కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.