English   

వెంకీ మామ ట్రైలర్ రివ్యూ.. మామా అల్లుళ్లు దుమ్ము దులిపేసారు..

venkymama
2019-12-07 21:18:20

తెలుగులో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చాలానే వ‌స్తున్నాయి. ముఖ్యంగా సీనియ‌ర్ హీరోలు వీటిని బాగానే ఎంక‌రేజ్ చేస్తున్నారు. వెంక‌టేష్ చేసిన ఎఫ్ 2 కానీ.. చిరంజీవి సైరా కానీ అన్నీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలే. ఇదే దారిలో ఇప్పుడు వెంకీ మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు. మేన‌ల్లుడు నాగ‌చైత‌న్యతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు వెంక‌టేష్. ప్రేమ‌మ్ లో కాసేపు మామ‌గా క‌నిపించి మాయం అయిపోయాడు వెంక‌టేష్. ఇప్పుడు పూర్తిగా ర‌చ్చ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న సినిమా వెంకీమామ‌. ఈ చిత్రం డిసెంబర్ 13న విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది. పూర్తిగా మాస్ ప్లస్ క్లాస్ ఉండేలా ప్లాన్ చేసాడు దర్శకుడు బాబీ. వెంకటేష్ అయితే కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్ పక్కాగా పండించాడు. జై ల‌వ‌కుశ త‌ర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని బాబీ చేస్తోన్న సినిమా ఇది. పూర్తిగా గ్రామ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. మనిషి తలరాతను రాసే శక్తి దేవుడికి ఉందని నీ నమ్మకం.

. ఆ రాతను తిరిగిరాసే శక్తి మనిషి ప్రేమకు ఉందని నా నమ్మకం..నీ నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరు మామయ్యా.. అది నీ వల్ల కూడా కాదు.. ఈ సారి జాతరను రంగులతో కాదు.. మీ రక్తంలో ఎరుపెక్కిస్తాను.. రండ్రా నా కొడకల్లారా.. వాళ్లు రోజూ దాటే గీత మనం ఒక్కసారి దాటితే ఎలా ఉంటుందో చూపించి వస్తాను సర్ అంటూ మాస్ డైలాగులతో రచ్చ చేసారు మామా అల్లుళ్లు. ఇందులో చైతూకు జోడీగా రాశీ ఖన్నా.. వెంకీకి జోడీగా పాయ‌ల్ రాజ్ పుత్ న‌టిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ కామెడీ ఎంట‌ర్టైనర్ గా వెంకీ మామాను తెరకెక్కించాడు ద‌ర్శ‌కుడు బాబీ. ఈ సినిమాకు కూడా కోన వెంక‌ట్ త‌న ర‌చ‌నా స‌హ‌కారం అందించాడు. ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటామని ధీమాగా చెబుతున్నారు మామా అల్లుళ్లు.

 

More Related Stories